వృద్దులు వద్దు _ ఆస్తులు ముద్దు

( జూన్ 15 ప్రపంచ వృద్ధుల వేదింపుల అవగాహన దినోత్సవం సందర్భంగా) వ్యథాభరితం వృద్ధాప్యం జీవన సంధ్యా సమయంలో వృద్ధాప్యం అంతులేని ఘర్షణలకు ఆవేదనలకు నిలయం వృద్ధాప్యం శాపం కాదు అది అనుభవాల ఆస్తి నైపుణ్యాల నిధి పెద్దరికం నవతరముతో నగుబాట్లకు గురౌవుతుంది కోటి ఆశలతో ఆకాంక్షల లతో కనిపెంచిన తల్లితండ్రులకు జీవిత మలిదశ లో కష్టాలే కానుకలైనాయి అవమానాలే అభినందనలైనాయి ఈసడింపులే పలకరింపు లైనాయి సూటి పోటి మాటలలే వారి పాలిట ఆత్మీయ స్పర్శ అయ్యింది నిరంతరం శ్రమించిన త్యాగమూర్తులకు గుక్కెడు గంజి‌ మెతుకులు కరువైనాయి ఆత్మీయత కరువై ఒంటరి తనం ఆస్తి అయ్యింది నిరాశే తోడు నీడైంది జవసత్వాలు ఉడిగి వృ ద్దాప్యపు...