Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • తల్లి తండ్రులు దైవస్వరూపులు

    Author VENKATESH | 15 Jun 2026, 04:36 PM | TELANGANA, నారాయణపేట
    తల్లి తండ్రులు దైవస్వరూపులు

    - సీనియర్ సివిల్ జడ్జి వింధ్యా నాయక్.

    నారాయణపేట జిల్లా, జూన్ 15( బి వి కే న్యూస్ )

    తెలంగాణా రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ మరియు చైర్మన్ కం జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆదేశాల మేరకు నారాయణపేట జిల్లా కోర్టు ఆవరణలో సీనియర్ సివిల్ జడ్జి వింధ్య నాయక్ అధ్యక్షతన న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా సీనియర్ సివిల్ జడ్జి వింధ్య నాయక్ మాట్లాడుతూ తల్లిదండ్రులను వారి పిల్లలు గౌరవించాలని, తల్లిదండ్రులు భగవత్ స్వరూపులని, వారిని సేవించుకోవడం మన అదృష్టమని తెలిపారు. నేటి సమాజంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు ప్రాముఖ్యత తగ్గిపోతుందని ఉమ్మడి కుటుంబానికి ప్రతి ఒక్కరూ ప్రాధాన్యత ఇవ్వాలని, కానీ ఈ రోజుల్లో అందరూ ఉమ్మడి కుటుంబానికి దూరమవుతున్నారని తెలిపారు. వృద్ధాప్యంలో తల్లిదండ్రుల పోషణ, బాగోగులు, మెయింటెనెన్స్, మందులు, ఆహార అవసరాలను, ఇంట్లో ప్రశాంతత సరైన సపోర్ట్ ఇచ్చి కుటుంబ సభ్యులను జాగ్రత్తగా చూసుకోవాలని తెలిపారు. ఈ రోజుల్లో మనుషులకు ఇవ్వాల్సిన సమయాన్ని టీవీలు, ఫోన్లకు కేటాయిస్తూ వృద్ధులను వృద్ధాశ్రమాల్లో వదిలివేస్తున్నారని, వారు కూడా వృద్దులు అవుతారని, కుటుంబ సభ్యులు కలిసిమెలిసి వృద్దులకు సమయం కేటాయించి, వారి మనసును బాధపెట్టకుండా చూసుకోవాలని సూచించారు. ఆస్తులు రాయించుకున్న తర్వాత వృద్ధులను హింసించడం, నిరాదరణకు గురిచేయడం, రోడ్లపై వదిలివేయడం వంటి ఘటనలు జరిగితే, బాధిత వృద్ధులు కోర్టును ఆశ్రయించి కేసు వేస్తే, తల్లిదండ్రుల సంరక్షణ మరియు పోషణ చట్టం-2007 ప్రకారం ఆ ఆస్తులు తిరిగి వృద్ధులకే దక్కుతాయి" అని స్పష్టం చేశారు. వృద్ధులకు ఏవైనా న్యాయపరమైన సమస్యలు ఉంటే జిల్లా న్యాయ సేవాధికార సంస్థ ట్రోల్ ఫ్రీ నెంబర్ 15100 సంప్రదించాలని, ఉచిత న్యాయ సహాయం అందిస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో ప్రధాన జూనియర్ సివిల్ జడ్జి బి. సాయి మనోజ్, అడిషనల్ జూనియర్ సివిల్ జడ్జి కే. అవినాష్, ద్వితీయ శ్రేణి న్యాయమూర్తి మురళీధర్, సీనియర్ న్యాయవాది రఘువీర్ లు మాట్లాడుతూ వృద్ధుల సంక్షేమం మరియు వారికి న్యాయపరంగా లభించే చట్టాల గురించి వివరించారు. చీఫ్ లీగల్ ఎయిడ్ డిఫెన్స్ కౌన్సెల్ కే. లక్ష్మి పతి గౌడ్ ఉచిత న్యాయ సహాయం గురించి వివరించారు. ఇట్టి సదస్సుకు న్యాయవాదులు జాగ్రతి కమిటీ సభ్యులు కాలప్ప, కుర్మన్న, నారాయణపేట బార్ అసోసియేషన్ న్యాయవాదులు, కోర్టు, లోక్ అదాలత్ సిబ్బంది, పోలీసులు, వయోవృద్దులు, మహిళలు మరియు కక్షిదారులు పాల్గొన్నారు.

    ఇవి కూడా చదవండి