తల్లి తండ్రులు దైవస్వరూపులు
- సీనియర్ సివిల్ జడ్జి వింధ్యా నాయక్. నారాయణపేట జిల్లా, జూన్ 15( బి వి కే న్యూస్ ) తెలంగాణా రాష్ట్ర న్యాయ సేవా అధికార సంస్థ మరియు చైర్మన్ కం జిల్లా ప్రధాన న్యాయమూర్తి, జిల్లా న్యాయ సేవా అధికార సంస్థ ఆదేశాల మేరకు నారాయణపేట జిల్లా కోర్టు ఆవరణలో సీనియర్ సివిల్ జడ్జి వింధ్య నాయక్ అధ్యక్షతన న్యాయ విజ్ఞాన సదస్సు నిర్వహించడం జరిగింది. దానిలో భాగంగా సీనియర్ సివిల్ జడ్జి వింధ్య నాయక్ మాట్లాడుతూ తల్లిదండ్రులను వారి పిల్లలు గౌరవించాలని, తల్లిదండ్రులు భగవత్ స్వరూపులని, వారిని సేవించుకోవడం మన అదృష్టమని తెలిపారు. నేటి సమాజంలో ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు ప్రాముఖ్యత...