Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఇండియా వ‌ర్సెస్ పాకిస్థాన్‌.. గొడ‌వ ప‌డ్డ క్రికెట‌ర్లు..

    Author VENKATESH | 15 Jun 2026, 01:15 PM | Sports
     ఇండియా వ‌ర్సెస్ పాకిస్థాన్‌.. గొడ‌వ ప‌డ్డ క్రికెట‌ర్లు..

    ఆర్టిఫిషియ‌ల్ ఇంటెలిజెన్స్ అంద‌ర్నీ అట్రాక్ట్ చేస్తోంది. అలాగే క‌న్ఫ్యూజ్ కూడా చేస్తోంది. ఏది మంచో ఏది చెడో తెలియని సంద‌ర్భం ఎదుర‌వుతోంది. కొన్ని ఏఐ వీడియోలు ఇక జ‌నాల‌ను తీవ్ర టెన్ష‌న్‌లోకి నెట్టేస్తున్నాయి. వీడియో మాయాజాలంతో క్రికెట్ అభిమానుల్ని కొంద‌రు బోల్తా కొట్టిస్తున్నారు. టీ20 వ‌ర‌ల్డ్‌క‌ప్‌లో ఆదివారం దాయాది పాకిస్థాన్‌తో ఇండియా త‌ల‌ప‌డింది. ఆ మ్యాచ్‌( India vs Pakistan )లో 64 ర‌న్స్ తేడాతో భార‌త్ విక్ట‌రీ కొట్టింది. కానీ హ‌ర్మ‌న్‌ప్రీత్ సేన‌, పాక్ క్రికెట‌ర్ల మ‌ధ్య గొడ‌వ జ‌రిగిన‌ట్లు ఓ వీడియో వైర‌ల్ అవుతోంది. కానీ వాస్త‌వానికి మ్యాచ్‌లో అలాంటి సంద‌ర్భం ఏదీ చోటుచేసుకోలేదు. భార‌తీయ బ్యాట్‌వుమెన్‌ను ఓ పాకిస్తానీ క్రికెట‌ర్ రెచ్చ‌గొట్టిన‌ట్లుగా ఆ వీడియోలో ఉన్న‌ది. ఆ స‌మ‌యంలో భార‌త బ్యాట‌ర్ కూడా పాక్ ప్లేయ‌ర్‌పై చేయి చేసుకున్న‌ట్లు వీడియోలో ప్ర‌జెంట్ చేశారు. ఇక అంపైర్లు వ‌చ్చి ఆ గొడ‌వ‌ను స‌ద్దుమ‌ణిగేలా చేశారు. వాస్త‌వానికి మ్యాచ్‌లో ఇలాంటి ఘ‌ట‌న ఏమీ జ‌ర‌గ‌లేదు. కానీ కృత్రిమ మేధ‌తో సృష్టించిన ఆ ఫేక్‌ వీడియో క్రికెట్ అభిమానుల‌ను గంద‌ర‌గోళంలోకి నెట్టేసింది.