Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • మరోసారి విఫలమైన వైభవ్ సూర్యవంశీ!

    Author VENKATESH | 15 Jun 2026, 12:31 PM | Sports
    మరోసారి విఫలమైన వైభవ్ సూర్యవంశీ!

    ఐపీఎల్ 2026లో విధ్వంసకర బ్యాటింగ్‌తో దుమ్మురేపిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ లిస్ట్-ఏ క్రికెట్‌లో మాత్రం ఆ జోరు చూపించలేకపోతున్నాడు. భారత్-ఏ తరఫున శ్రీలంక పర్యటనకు వెళ్లిన వైభవ్ సూర్యవంశీ వరుసగా మూడో మ్యాచ్‌లోనూ విఫలమయ్యాడు. ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా ఇవాళ(సోమవారం) దంబుల్లా వేదికగా శ్రీలంక-ఏతో జరుగుతున్న మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ 14 మ్యాచ్‌ల్లో 21 పరుగులే చేసి వెనుదిరిగాడు. 150 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేసిన వైభవ్ 3 ఫోర్లు, ఒక సిక్స్ కొట్టాడు. సహన్ అరాచ్చిగే బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు.
    ఈ ముక్కోణపు సిరీస్‌లో ఇప్పటి వరకు వైభశ్ సూర్యవంశీ మూడు మ్యాచ్‌లు ఆడాడు. అయితే ఒక్క ఇన్నింగ్స్‌లోనూ చెప్పుకోదగ్గ రీతిలో బ్యాటింగ్ చేయలేదు. శ్రీలంక-ఏతో జరిగిన తొలి మ్యాచ్‌లో 14 పరుగులు, అఫ్గాన్-ఏతో జరిగిన రెండో మ్యాచ్‌లో 44 పరుగులు చేశాడు. తాజాగా మూడో మ్యాచ్‌లో 14 బంతుల్లో 21 పరుగులు చేసి పెవిలియన్ చేరాడు. దూకుడుగా ఆడే ప్రయత్నంలో వికెట్ కోల్పోతున్నాడు.
    ఐపీఎల్‌ 2026లో విధ్వంసకర బ్యాటింగ్‌తో చెలరేగిన వైభవ్ సూర్యవంశీ.. అంతర్జాతీయ వేదికపై ఇలా వరుసగా విఫలమవ్వడం అభిమానులను ఆందోళనకు గురి చేస్తోంది. ప్రస్తుతం జరుగుతున్న ముక్కోణపు సిరీస్‌లో వైభవ్ సూర్యవంశీ రాణించకపోతే.. అతడి అంతర్జాతీయ క్రికెట్ అరంగేట్రంపై ప్రభావం చూపే అవకాశం ఉందని క్రికెట్ నిపుణులు అభిప్రాయపడుతున్నారు