మరోసారి విఫలమైన వైభవ్ సూర్యవంశీ!

ఐపీఎల్ 2026లో విధ్వంసకర బ్యాటింగ్‌తో దుమ్మురేపిన యువ సంచలనం వైభవ్ సూర్యవంశీ లిస్ట్-ఏ క్రికెట్‌లో మాత్రం ఆ జోరు చూపించలేకపోతున్నాడు. భారత్-ఏ తరఫున శ్రీలంక పర్యటనకు వెళ్లిన వైభవ్ సూర్యవంశీ వరుసగా మూడో మ్యాచ్‌లోనూ విఫలమయ్యాడు. ముక్కోణపు వన్డే సిరీస్‌లో భాగంగా ఇవాళ(సోమవారం) దంబుల్లా వేదికగా శ్రీలంక-ఏతో జరుగుతున్న మ్యాచ్‌లో వైభవ్ సూర్యవంశీ 14 మ్యాచ్‌ల్లో 21 పరుగులే చేసి వెనుదిరిగాడు. 150 స్ట్రైక్‌రేట్‌తో బ్యాటింగ్ చేసిన వైభవ్ 3 ఫోర్లు, ఒక సిక్స్ కొట్టాడు. సహన్ అరాచ్చిగే బౌలింగ్‌లో క్యాచ్ ఔట్‌గా వెనుదిరిగాడు. ఈ ముక్కోణపు సిరీస్‌లో ఇప్పటి వరకు వైభశ్ సూర్యవంశీ మూడు మ్యాచ్‌లు ఆడాడు. అయితే ఒక్క ఇన్నింగ్స్‌లోనూ చెప్పుకోదగ్గ రీతిలో...