Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • తెలంగాణ వచ్చినా సింగరేణిలో పరిస్థితి మారలేదు

    Author VENKATESH | 15 Jun 2026, 12:09 PM | TELANGANA
    తెలంగాణ వచ్చినా సింగరేణిలో పరిస్థితి మారలేదు

    మాజీ మంత్రి హరీశ్ రావుపై తెలంగాణ రక్షణ సేన(టీఆర్‌ఎస్) అధ్యక్షురాలు కవిత తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. హరీశ్ రూ.40లక్షల టన్నుల బొగ్గు స్కామ్ జరిగిందని అంటున్నారని, సరైన సమాచారం లేకుండానే కోల్ బెల్ట్‌లో తిరుగుతున్నారంటూ వ్యాఖ్యానించారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కూడా హరీశ్ రావు మాయలో పడ్డారన్నారు. హరీశ్‌రావు లేఖ రాయగానే.. కిషన్‌రెడ్డి వెంటనే మరో లేఖ రాశారని తెలిపారు. తెలంగాణలో ఓపెన్ కాస్ట్‌లతో సమానంగా అండర్ గ్రౌండ్స్ ఓపెన్ చేయాలని డిమాండ్ చేశారు. తద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు పెరిగే అవకాశం ఉందన్నారు.
    తెలంగాణ వచ్చిన తర్వాత కూడా సింగరేణిలో పరిస్థితి మారలేదని కవిత వ్యాఖ్యానించారు. కార్మికులపై అత్యంత కర్కశంగా యాజమాన్యం వ్యవహరిస్తోందని.. ప్రశ్నించే కార్మికులను అధికారులు వేధిస్తున్నారని ఆరోపించారు. దీనంతటికీ కారణం ప్రభుత్వ అలసత్వమే అని మండిపడ్డారు. ఇటీవల డిప్యూటీ సీఎం భట్టి వక్రిమార్క సింగరేణిలో పర్యటించారని.. కానీ కార్మికుల సమస్యలను తెలుసుకోలేదన్నారు. భట్టి విక్రమార్క పర్సంటేజ్‌లు తీసుకోవడం మానేయాలని.. ఆ తర్వాతే ప్రతిపక్షాలపై విమర్శలు చేయాలన్నారు