తెలంగాణ వచ్చినా సింగరేణిలో పరిస్థితి మారలేదు
మాజీ మంత్రి హరీశ్ రావుపై తెలంగాణ రక్షణ సేన(టీఆర్‌ఎస్) అధ్యక్షురాలు కవిత తీవ్రస్థాయిలో విమర్శలు గుప్పించారు. సోమవారం మీడియాతో మాట్లాడుతూ.. హరీశ్ రూ.40లక్షల టన్నుల బొగ్గు స్కామ్ జరిగిందని అంటున్నారని, సరైన సమాచారం లేకుండానే కోల్ బెల్ట్‌లో తిరుగుతున్నారంటూ వ్యాఖ్యానించారు. కేంద్రమంత్రి కిషన్‌రెడ్డి కూడా హరీశ్ రావు మాయలో పడ్డారన్నారు. హరీశ్‌రావు లేఖ రాయగానే.. కిషన్‌రెడ్డి వెంటనే మరో లేఖ రాశారని తెలిపారు. తెలంగాణలో ఓపెన్ కాస్ట్‌లతో సమానంగా అండర్ గ్రౌండ్స్ ఓపెన్ చేయాలని డిమాండ్ చేశారు. తద్వారా యువతకు ఉద్యోగ అవకాశాలు పెరిగే అవకాశం ఉందన్నారు. తెలంగాణ వచ్చిన తర్వాత కూడా సింగరేణిలో పరిస్థితి మారలేదని కవిత వ్యాఖ్యానించారు. కార్మికులపై అత్యంత కర్కశంగా యాజమాన్యం...