Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • బ్రేక్ ఫాస్ట్లో బొద్దింక - బాసర ఆర్జీయూకేటీ భోజన శాలలో మారని పరిస్థితులు!

    Author VENKATESH | 15 Jun 2026, 11:29 AM | TELANGANA
    బ్రేక్ ఫాస్ట్లో బొద్దింక - బాసర ఆర్జీయూకేటీ భోజన శాలలో మారని పరిస్థితులు!

    తినే ఆహారం పరిశుభ్రంగా ఉండాలి. అప్పుడే అనారోగ్యం బారిన పడకుండా ఉంటామని వైద్యులు అందరికీ చెబుతుంటారు. దీనికోసం ప్రభుత్వం కూడా పలు ఆరోగ్య జాగ్రత్తలను పాటిస్తూ పాఠశాలల్లో గానీ కళాశాలల్లో గానీ నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు ప్రయత్నం చేస్తోంది. కానీ ఏం లాభం. కింది స్థాయిలో ఉండే భోజన నిర్వాహకులు వారి ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. విద్యార్థులకు అందించే ఆహారం విషయంలో కనీస ప్రమాణాలు పాటించట్లేదు. దీనివల్ల వారి ప్రాణాలకే ముప్పు వాటిల్లే పరిస్థితి ఏర్పడుతోంది. తాజాగా బాసర ఆర్జీయూకేటీలో ఆదివారం వడ్డించిన అల్పాహారంలో బొద్దింక కనిపించింది. దీంతో విద్యార్థులు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు.

    ప్రతీసారి పోరాటాలు - మార్పు ఎక్కడ? : బాసర ఆర్జీయూకేటీలో గతంలో 2022, 2023లో ఫుడ్‌ పాయిజన్‌ అయ్యింది. దీంతో దాదాపు 400 మంది విద్యార్థులు అస్వస్థతకు గురయ్యారు. ఈ విషయంపై సంబంధిత సిబ్బందికి ఫిర్యాదు చేశారు. అయినప్పటికీ అధికారులు నామమాత్రంగానే చర్యలు తీసుకున్నారు. భోజన నిర్వాహకులను మార్చకుండా మళ్లీ పాతవారినే కొనసాగించారు. దీనివల్ల నిర్వాహణ మరోసారి ఇష్టారాజ్యంగా మారింది. ఫలితంగా ఈ ఆదివారం అల్పాహారంలో బొద్దింక వచ్చింది. ఇలాంటి ఘటనలు పునరావృతమవుతున్నాయని, ప్రతీసారి పోరాటాలు చేస్తున్నా పట్టించుకునే నాథుడే లేడని విద్యార్థులు వాపోతున్నారు.

    బ్రేక్ ఫాస్ట్లో బొద్దింక - బాసర ఆర్జీయూకేటీ భోజన శాలలో మారని పరిస్థితులు! - Additional Image