బ్రేక్ ఫాస్ట్లో బొద్దింక - బాసర ఆర్జీయూకేటీ భోజన శాలలో మారని పరిస్థితులు!
తినే ఆహారం పరిశుభ్రంగా ఉండాలి. అప్పుడే అనారోగ్యం బారిన పడకుండా ఉంటామని వైద్యులు అందరికీ చెబుతుంటారు. దీనికోసం ప్రభుత్వం కూడా పలు ఆరోగ్య జాగ్రత్తలను పాటిస్తూ పాఠశాలల్లో గానీ కళాశాలల్లో గానీ నాణ్యమైన ఆహారాన్ని అందించేందుకు ప్రయత్నం చేస్తోంది. కానీ ఏం లాభం. కింది స్థాయిలో ఉండే భోజన నిర్వాహకులు వారి ఇష్టారీతిన వ్యవహరిస్తున్నారు. విద్యార్థులకు అందించే ఆహారం విషయంలో కనీస ప్రమాణాలు పాటించట్లేదు. దీనివల్ల వారి ప్రాణాలకే ముప్పు వాటిల్లే పరిస్థితి ఏర్పడుతోంది. తాజాగా బాసర ఆర్జీయూకేటీలో ఆదివారం వడ్డించిన అల్పాహారంలో బొద్దింక కనిపించింది. దీంతో విద్యార్థులు సిబ్బందిపై ఆగ్రహం వ్యక్తం చేశారు. ప్రతీసారి పోరాటాలు - మార్పు ఎక్కడ? : బాసర ఆర్జీయూకేటీలో...