Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఓ మనిషి కాలాన్ని గెలిచేయ్

    Author VENKATESH | 14 Jun 2026, 01:32 PM | EDITORIAL
    ఓ మనిషి  కాలాన్ని గెలిచేయ్

    ఓ మనిషి
    గతాన్ని తలవద్దు
    భవిష్యత్తును ఊహించి
    ఆందోళన పడొద్దు

    ఓ మనిషి నీ జీవితం
    సుఖ దుఃఖాల వలయం
    గతాన్ని తలవద్దు
    నిన్నటి గాయాలనీడను
    విడిచి పెట్టు

    గడచిన కాలం తిరిగి రాదు
    గతాన్ని తలిచి కన్నీరు పెట్టకు
    నిన్నటితప్పులునిన్ను వెంటాడిన
    కన్నీళ్ళతో కాలాన్ని వృధాచేయకు
    ముళ్ళ బాటను తలచుకుంటూ
    కుంగిపోకు వాయిదా తత్వంతో
    వ్యాకులతను పెంచుకోకు

    రేపటి గురించి చింతించకు
    భవిష్యత్తును ఊహించి
    భయపడకు చెప్పుడు
    మాటలు విని చెడిపోకు

    చెల్లని రూపాయికి గీతలెక్కువ
    చేతి గాని వానికి మాటలెక్కువ

    రాని కష్టాల గురించి ఇప్పుడే
    ఏడవకు ఊహాలోకంలో
    తేలిపోకు పోలీకత్వపు
    పోకడలకు పోకు
    ఈర్ష్య ద్వేషాలను వదులుకో

    ఆందోళనల సుడిగుండంలో
    చిక్కుకొని బుర్ర పాడుచేసుకోకు
    మనశ్శాంతిని చేజేతులారా
    దూరం చేసుకోకు

    ఇవి కూడా చదవండి

    నిన్న అనేది ఒక ముగిసిన కథ
    రేపు అనేది తెలియని గీత
    ఈ క్షణమే నీ చేతిలో ఉన్నది
    ఈ క్షణమే నీకు బలాన్ని ఇస్తుంది

    ప్రస్తుతం కాలమే నీ జీవిత
    గమ్యాన్ని నిర్ణయిస్తుంది
    కష్టాలు వచ్చినా ఎదురొడ్డి
    నిలబడు చిరునవ్వుతో
    అడుగు ముందుకేయి

    భయాన్నీ వదిలి ధైర్యంగా
    ముందకు సాగాలి
    ధైర్యంగా నిలుస్తేనే సరి
    కొత్త చరిత్ర సృష్టిస్థావు
    సమాజానికి స్పూర్తివై
    చీకటిని పారదోలే
    వెలుగువైతావు

    ఈ నిమిషాన్ని సంతోషంగా
    మార్చుకో గతాన్ని మరచిపో
    భవిష్యత్తును వదిలేయి
    వర్ధమానంలోనే
    నీ జీవితాన్ని గెలిచేయ్

    గతం ఒక జ్ఞాపకం
    భవిష్యతు ఒక ఊహా
    ప్రస్తుత క్షణంలో
    జీవించడమే మనిషి
    పరమార్ధం కావాలి

    మార్చలేని గతాన్ని గూర్చి
    తలచుకుంటూ బాధపడేకంటే
    భవిష్యత్తును ఊహించి ఆందోళన
    చెందక ప్రస్తుత క్షణంలో జీవిస్తూ
    ముందున్న పని మీద దృష్టిపెడితె
    ఒత్తిళ్లు దూరమౌతాయి
    విజయాలు సొంతమౌతాయి

    నేదునూరి కనకయ్య
    అధ్యక్షులు తెలంగాణ
    ఎకనామిక్ ఫోరం
    ఫ్రీలాన్స్ జర్నలిస్ట్
    కాలమిస్ట్
    మాజీఎన్ ఎస్ ఎస్ అధికారి
    మాజీ కరెస్పాండెంట్
    జస్టిస్ కుమారయ్య లా కాలేజీ
    కరీంనగర్
    కరీంనగర్9440245771