ఓ మనిషి కాలాన్ని గెలిచేయ్
ఓ మనిషి గతాన్ని తలవద్దు భవిష్యత్తును ఊహించి ఆందోళన పడొద్దు ఓ మనిషి నీ జీవితం సుఖ దుఃఖాల వలయం గతాన్ని తలవద్దు నిన్నటి గాయాలనీడను విడిచి పెట్టు గడచిన కాలం తిరిగి రాదు గతాన్ని తలిచి కన్నీరు పెట్టకు నిన్నటితప్పులునిన్ను వెంటాడిన కన్నీళ్ళతో కాలాన్ని వృధాచేయకు ముళ్ళ బాటను తలచుకుంటూ కుంగిపోకు వాయిదా తత్వంతో వ్యాకులతను పెంచుకోకు రేపటి గురించి చింతించకు భవిష్యత్తును ఊహించి భయపడకు చెప్పుడు మాటలు విని చెడిపోకు చెల్లని రూపాయికి గీతలెక్కువ చేతి గాని వానికి మాటలెక్కువ రాని కష్టాల గురించి ఇప్పుడే ఏడవకు ఊహాలోకంలో తేలిపోకు పోలీకత్వపు పోకడలకు పోకు ఈర్ష్య ద్వేషాలను వదులుకో ఆందోళనల సుడిగుండంలో చిక్కుకొని...