Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • రేపటి నుంచే విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ - సోమవారం నుంచి శనివారం వరకు ఇదే మెనూ

    Author VENKATESH | 14 Jun 2026, 12:04 PM | TELANGANA, హైదరాబాద్
    రేపటి నుంచే విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ - సోమవారం నుంచి శనివారం వరకు ఇదే మెనూ

    తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్‌ కాలేజీల్లో బ్రేక్‌ఫాస్ట్‌ పథకానికి ఈ నెల 15న (రేపు) రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. అందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. తొలి విడత మొత్తం 1,302 విద్యా సంస్థల్లో ప్రారంభించనున్నారు. అందులో 1,269 స్కూల్స్, 33 కాలేజీలు ఉన్నాయి. వాటిల్లోని మొత్తం 1,44,610 మంది స్టూడెంట్స్​కు వారంలో ఆదివారం మినహా మిగిలిన 6 రోజులు ఉదయం పూట అల్పాహారం అందిస్తారు.

    రాష్ట్ర ప్రభుత్వం వాటా 70 శాతం : బ్రేక్‌ఫాస్ట్‌ పథకాన్ని సెంట్రలైజ్డ్‌ కిచెన్ల ద్వారా విడతల వారీగా నూతన విద్యా సంవత్సరంలోనే తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్‌ కాలేజీల్లో అమలు చేస్తారు. మొత్తం 33 జిల్లాల్లో 39 చోట్ల కేంద్రీకృత కిచెన్ల నిర్మాణానికి రూ.299.90 కోట్లు ఖర్చు అవుతుందని తెలంగాణ ప్రభుత్వం అంచనా వేసింది. అందులో ఇప్పటికే ఉన్న ఏడు కిచెన్లను ఉన్నతీకరిస్తారు. మిగిలినవి నూతనంగా నిర్మాణం చేపట్టనున్నారు. ఒక్కో కిచెన్‌కు రాష్ట్ర ప్రభుత్వం తన వాటాగా 70 శాతం భరిస్తుంది. మిగిలిన 30 శాతం మొత్తాన్ని ఆయా స్వచ్ఛంద సంస్థలు ఖర్చు భరించనున్నాయి. కిచెన్ల నిర్మాణ బాధ్యతలను తెలంగాణ రాష్ట్ర విద్యా సంక్షేమ, మౌలిక అభివృద్ధి సంస్థ పర్యవేక్షిస్తుంది. ఇప్పటికే టెండర్లు కూడా ఖరారయ్యాయి.

    ప్రధానోపాధ్యాయులకు రాష్ట్ర ప్రభుత్వం పంపిన మెనూ ఇదే :

    సోమవారం : దోసె (2) - సాంబారు/ చట్నీ

    మంగళవారం : మిల్లెట్‌ ఇడ్లీ (2) + సాంబారు

    బుధవారం : పూరీ (2) - మిక్స్‌డ్‌ వెజిటబుల్‌ కుర్మా

    ఇవి కూడా చదవండి

    గురువారం : బోండా (2) + సాంబారు/చట్నీ

    శుక్రవారం : ఇడ్లీ (2 )+ సాంబారు/చట్నీ

    శనివారం : ఉప్మా + సాంబారు/చట్నీ (ప్రీ ప్రైమరీ నుంచి 5వ తరగతి విద్యార్థులకు 150 గ్రాముల చొప్పున, 6 నుంచి 12 తరగతుల వారికి రెండు వందల గ్రాముల చొప్పున ఉప్మా అందిస్తారు.)

    22 లక్షలు : బ్రేక్‌ఫాస్ట్‌ పథకంతో తెలంగాణ రాష్ట్రంలోని మొత్తం ప్రీ ప్రైమరీ (పూర్వ పాథమిక) నుంచి ఇంటర్మీడియట్​ వరకు చదువుతున్న 22 లక్షల విద్యార్థులు లబ్ధి పొందనున్నారు.

    రూ.720 కోట్లు : పాఠశాలల్లో బ్రేేక్‌ఫాస్ట్‌ కోసం రూ.720 కోట్లు ఖర్చు చేయనున్నారు. వీటిలో పాలకు రూ.180 కోట్లు, అల్పాహారానికి రూ.540 కోట్లు.

    రూ.56 కోట్లు : ఇంటర్మీడియట్​ విద్యార్థులకు ప్రత్యేకంగా రూ.56 కోట్లు కేటాయించారు.రాగి/పాలు జావ : 3 రోజులు పాలు, మరో 3 రోజులు రాగి జావ ఇస్తారు. ప్రీ ప్రైమరీ నుంచి 5వ తరగతి వరకు 75 మి.లీ., మిగిలిన తరగతుల వారికి 100 మి.లీ. చొప్పున పాలు అందజేయనున్నారు.8 జిల్లాల్లో ప్రారంభం : బ్రేక్‌ఫాస్ట్‌ పథకాన్ని హరే కృష్ణ మూమెంట్‌ ఛారిటబుల్‌ ట్రస్ట్, మన్నా ట్రస్ట్‌లు మొత్తం 8 జిల్లాల్లో అమలు చేయనున్నాయి.మన్నా ట్రస్ట్‌ : మేడ్చల్‌-మల్కాజిగిరి, హైదరాబాద్ జిల్లాల్లోని 107 స్కూల్స్​లో చదివే 26,294 మంది స్టూడెంట్స్​కు ఈ పథకం అందుతుంది. ఈ 2 జిల్లాల్లో 12 కాలేజీల్లో 4,132 మందికి కూడా లభిస్తుంది.హరే కృష్ణ మూమెంట్‌ : నారాయణపేట, వికారాబాద్, రంగారెడ్డి, సంగారెడ్డి, హనుమకొండ, వరంగల్‌ జిల్లాల్లోని 1,162 స్కూల్స్​లో 1,03,891 మంది స్టూడెంట్స్​ ప్రయోజనం పొందుతారు. నారాయణపేట, వికారాబాద్, వరంగల్‌, హనుమకొండ జిల్లాల్లోని 21 ప్రభుత్వ జూనియర్‌ కళాశాలల్లోని 10,293 మందికి కూడా బ్రేక్‌ఫాస్ట్‌ అందుతుంది.జూనియర్‌ కళాశాలల్లోనూ మధ్యాహ్న భోజనం : ప్రస్తుతం తెలంగాణలో పాఠశాలలకే పరిమితమైన మధ్యాహ్న భోజన పథకాన్ని ఇక నుంచి ప్రభుత్వ జూనియర్‌ కాలేజీలకూ విస్తరించనున్నారు. ఇంటర్​ విద్యార్థులకు ఈ పథకం వర్తిస్తుంది. దీన్ని కూడా సోమవారం నుంచే 33 కాలేజీల్లో మొదలుపెడతారు. తెలంగాణ వ్యాప్తంగా మొత్తం 430 ప్రభుత్వ కాలేజీలు ఉన్నాయి. వాటిల్లో సుమారు 1.70 లక్షల మంది విద్యను అభ్యసిస్తున్నారు.