రేపటి నుంచే విద్యార్థులకు బ్రేక్ ఫాస్ట్ - సోమవారం నుంచి శనివారం వరకు ఇదే మెనూ
తెలంగాణ ప్రభుత్వ పాఠశాలలు, జూనియర్ కాలేజీల్లో బ్రేక్‌ఫాస్ట్ పథకానికి ఈ నెల 15న (రేపు) రాష్ట్ర ప్రభుత్వం శ్రీకారం చుట్టనుంది. అందుకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. తొలి విడత మొత్తం 1,302 విద్యా సంస్థల్లో ప్రారంభించనున్నారు. అందులో 1,269 స్కూల్స్, 33 కాలేజీలు ఉన్నాయి. వాటిల్లోని మొత్తం 1,44,610 మంది స్టూడెంట్స్కు వారంలో ఆదివారం మినహా మిగిలిన 6 రోజులు ఉదయం పూట అల్పాహారం అందిస్తారు. రాష్ట్ర ప్రభుత్వం వాటా 70 శాతం : బ్రేక్‌ఫాస్ట్ పథకాన్ని సెంట్రలైజ్డ్ కిచెన్ల ద్వారా విడతల వారీగా నూతన విద్యా సంవత్సరంలోనే తెలంగాణ రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ పాఠశాలలు, ప్రభుత్వ జూనియర్ కాలేజీల్లో అమలు చేస్తారు. మొత్తం...