Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • 4వ అతి పెద్ద పవన శక్తి ఉత్పత్తి చేస్తున్న దేశంగా భారత్‌

    Author VENKATESH | 14 Jun 2026, 11:49 AM | EDITORIAL
    4వ అతి పెద్ద పవన శక్తి ఉత్పత్తి చేస్తున్న దేశంగా భారత్‌

    (15 జూన్ “ప్రపంచ పవన దినోత్సవం” సందర్భంగా)

    ప్రపంచ పవన శక్తి సంస్థ ఆధ్వర్యంలో ప్రతి ఏట 15 జూన్‌ రోజున “ప్రపంచ పవన దినం” లేదా “వరల్డ్/గ్లోబల్‌‌ విండ్‌ డే” నిర్వహిస్తూ యువత, పౌర సమాజానికి పర్యావరణ హితమైన పవన శక్తి ప్రాధాన్యాలను, దాని ప్రయోజనాలను వివరించుట జరుగుతుంది. సంప్రదాయేతర తరగని పునరుత్పత్తి చేయగల శక్తి వనరుల్లో సౌరశక్తి తర్వాత 2వ ప్రధానమైన వనరుగా పవన శక్తికి గుర్తింపు ఉన్నది. ప్రపంచ పవన దినోత్సవం-2026 ఇతివృత్తంగా “పవన శక్తి : ఆశయం నుంచి వేగవంతమైన ప్రగతి ఆచరణ వైపు” అనబడే అంశాన్ని తీసుకొని ప్రచారం చేయడానికి కృషి చేయడం జరుగుతోంది. శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గిస్తూ, పర్యావరణహిత శక్తిని ఉత్పత్తి చేయడానికి దేశవ్యాప్తంగా సహజంగా వీస్తున్న పవనాల్లో దాగిన అపార శక్తిని విద్యుచ్ఛక్తిగా మార్చడానికి టర్బైన్‌లను వినియోగిస్తారు. ఈ టర్బైన్లు గవీస్తున్న గాలిలో దాగిన గతిశక్తిని యాంత్రిక శక్తిగా మార్చడం, తర్వాత విద్యుచ్ఛక్తిగా మార్చడం జరుగుతోంది. ఆన్‌షోర్‌, ఆఫ్‌షోర్‌ పవన శక్తులను ఒడిసిపట్టి, ఆరోగ్యకర పనరుత్పత్తి శక్తిని ఉత్పత్తినచేయడం నేటి కనీస అవసరంగా మారుతోంది.

    పవనశక్తిలో ప్రథమ స్థానం తమిళనాడు:
    ప్రపంచ దేశాల్లో చైనా, యూఎస్‌, జర్మనీ‌, భారత్‌ లాంటి దేశాలు పవన శక్తి వినియోగంలో ముందున్నాయి. యూరోప్‌లో వినియోగిస్తున్న మొత్తం శక్తిలో 20 శాతం పవన శక్తి ఉండడం హర్షదాయకం. తీరప్రాంతాలు, గాలి వీచే మైదాన ప్రాంతాలు అధికంగా ఉన్న భారత్‌ నాలుగవ అతి పెద్ద పవన శక్తి ఉత్పత్తి చేస్తున్న భారతంలో గుజరాత్‌, తమిళ నాడు, కర్నాటక, రాజస్థాన్‌ రాష్ట్రాలు పవన శక్తి పరిశ్రమలో ముందు ఉన్నాయి. తెలంగాణలో దాదాపు 130 మెగావాట్లకు పైగా పవనశక్తి ఉత్పత్తి కావడం, రానున్న రోజుల్లో మరింత పెంచే ప్రయత్నాలు చేయడం జరుగుతోంది. దేశ పవన శక్తిలో 40 శాతం వరకు తమిళ నాడు మాత్రమే ఉత్పత్తి చేస్తున్నది. 2025 తొలి త్రైమాసికంలో 50,000 మెగావాట్ల పవనశక్తి ఉత్పత్తికి నిర్మాణాలు జరిగాయి. కార్బన్‌ ఉద్గారాలను తగ్గించడానికి శిలాజ ఇంధనాల వినియోగాన్ని తగ్గించడానికి ప్రత్యామ్నాయంగా పునరుత్పత్తి పవన శక్తిని ఒడిసిపట్టడం మన తక్షణ కర్తవ్యం అని భావించాలి.

    ఇవి కూడా చదవండి

    ప్రపంచ పవన దినం లక్ష్యాలు:
    ప్రపంచ పవన దినోత్సవ వేదికగా పవన శక్తి పట్ల అవగాహన, పర్యావరణ పరిరక్షణ, ఆర్థిక ప్రగతికి దోహదపడడం, పవనాల నుంచి చవకైన విద్యుచ్చక్తిని తయారు చేయడం, పవన శక్తి వినియోగం పట్ల ప్రభుత్వ పాలసీలు రచించడం/అమలు చేయడం జరుగుతుంది. నేడు ప్రపంచవ్యాప్తంగా పవనశక్తి రంగంలో 3.7 లక్షల ఉద్యోగులు పని చేస్తుండగా, 2030 నాటికి వీరి సంఖ్య 6 లక్షలకు పెరగవచ్చని అంచనా వేస్తున్నారు. పవనశక్తి ఉత్పత్తిని క్రమంగా పెంచడానికి పలు దేశాలు కార్యాచరణను సిద్ధం చేయడం, అధిక ప్రాధాన్యం ఇవ్వడం కొనసాగుతున్నది. గృహాల్లో వెలుగులు నింపడం, పరిశ్రమల్లో యంత్రాలు కదలడానికి పవనశక్తిని వినియోగిస్తున్నాం. గుట్టలు, కొండలు, పర్వతాలు, సముద్రాలు, తీరప్రాంతాల్లో పవనశక్తిని ఒడిసిపట్ట వచ్చని గమనించాలి.

    పవనశక్తి ప్రాధాన్యాన్ని గుర్తించి, ఆ దిశగా వడివడిగా అడుగులు వేస్తూ, సుస్థిరాభివృద్ధికి ఊతం ఇవ్వాలి. నేడు ప్రపంచాన్ని కుదిపేస్చున్న వాతావరణ ప్రతికూల మార్పులను కట్టడి చేయడానికి తరగని శక్తి వనరులను ఆశ్రయించాల్సిందే. పవనశక్తి ఉత్పత్తికి అనుకూలంగా ఉన్న భారతం రానున్న రోజుల్లో పవనశక్తి ఉత్పత్తిని పెంచుతూ ప్రపంచ పవనశక్తి దేశంగా పేరు తెచ్చుకోవాలి, పర్యావరణాన్ని పరిరక్షిణచుకోవాలి. భవిష్యత్తు శక్తి భద్రతలో పవనశక్తి పాత్ర విశిష్టమైనదని తెలుసుకోవాలి. మెయింటెనెన్స్‌ ఖర్చులు అతి తక్కువగా ఉన్న పవనశక్తి రంగం రానున్న రేజుల్లో మన దేశంలో మరింత పుంజుకోవాలని కోరుకుందాం.

    డా: బుర్ర మధుసూదన్ రెడ్డి
    9949700037