4వ అతి పెద్ద పవన శక్తి ఉత్పత్తి చేస్తున్న దేశంగా భారత్
(15 జూన్ “ప్రపంచ పవన దినోత్సవం” సందర్భంగా) ప్రపంచ పవన శక్తి సంస్థ ఆధ్వర్యంలో ప్రతి ఏట 15 జూన్ రోజున “ప్రపంచ పవన దినం” లేదా “వరల్డ్/గ్లోబల్ విండ్ డే” నిర్వహిస్తూ యువత, పౌర సమాజానికి పర్యావరణ హితమైన పవన శక్తి ప్రాధాన్యాలను, దాని ప్రయోజనాలను వివరించుట జరుగుతుంది. సంప్రదాయేతర తరగని పునరుత్పత్తి చేయగల శక్తి వనరుల్లో సౌరశక్తి తర్వాత 2వ ప్రధానమైన వనరుగా పవన శక్తికి గుర్తింపు ఉన్నది. ప్రపంచ పవన దినోత్సవం-2026 ఇతివృత్తంగా “పవన శక్తి : ఆశయం నుంచి వేగవంతమైన ప్రగతి ఆచరణ వైపు” అనబడే అంశాన్ని తీసుకొని ప్రచారం చేయడానికి కృషి చేయడం జరుగుతోంది. శిలాజ ఇంధనాల వినియోగాన్ని...