Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • భూసార "పునరుద్ధరణ" తో మానవ‌ మనుగడ

    Author VENKATESH | 13 Jun 2026, 07:12 PM | Array
    భూసార "పునరుద్ధరణ" తో మానవ‌ మనుగడ

    (జూన్17 న ప్రపంచ ఎడారీకరణ కరువు దినోత్సవం సందర్భంగా)

    నేలల తీరుతెన్నులే ప్రపంచ ఆహార భద్రత ను నిర్ణయిస్తాయి. భూమి లోని సహజ పోషకాలు వ్యవసాయానికి ఆవరణ వ్యవస్థకు ఉపయోగపడుతాయి. భూసారం సకల జీవ జాతులకు ఆహారం ఆవాసాన్ని అందించి మానవ నాగరికతకు పునాదిగా నిలుస్తుంది.
    భూమి ప్రకృతి ప్రసాదితం
    భూమిని పెంచలేము ఉన్న భూమిని సoరక్షించుకుంటేనే ఆర్థిక వ్యవస్థలో సుస్థిరాభివృద్ధి సాధ్యమవుతుంది.
    ఎడారీకరణ వ్యవసాయ యోగ్యమైన భూమి సారాన్ని కోల్పోవడమే ఎఢారీకరణ అంటారు.
    ఎడారులు వేరు‌ ఎడారీకరణ వేరు
    భూ క్షీణతకు మరొక రూపమే ఎడారీకరణ .మానవుని చర్యలు వాతావరణం మార్పులు కారణంగా భూమి ఉత్పాదక సామర్థ్యం తగ్గిపోవడాన్ని ఎడారీకరణగా భావిస్తారు. భూమి మనుషులకే కాక సకల జీవ జాతులకు ఆహారాన్ని ఆవాసాన్ని అందించే ఏర్పాటు ప్రకృతి చేసింది.కాలుష్యం అడవుల నరికివేత యుధ్ధాలు లాంటివి ఎడారీకరణ కు దారి తీస్తున్నాయి. ఎడారీకరణ ‌వలన‌ భూమి నిస్సారంగా మారుతుంది. ఆహార కొరతనీటికొరతఏర్పడుతుంది.
    ఆర్థిక వ్యవస్థలో వలసలు పేదరికం' నిరుద్యోగం పెరుగుతుంది.
    2026 సం" థీమ్
    ప్రపంచ ఎడారీకరణ
    మరియు కరువు నివారణ దినోత్సవం యొక్క ఇతివృత్తం
    పచ్చిక బయళ్ళు (మేత భూములు) గుర్తించండి గౌరవించండి పునరుద్ధరించండి. అనే నినాదంతో ఈ దినోత్సవాన్ని నిర్వహిస్తారు .

    2026 సం" ప్రపంచ స్థాయి అధికారిక వేడుకలకు కెన్యా దేశం ఆతిథ్యం ఇస్తుంది. దాదాపు ఒక దశాబ్దం తర్వాత ఆఫ్రికా ఖండంలో ఈ వేదికలు జరగడం ప్రథమం.

    ఇవి కూడా చదవండి

    ఈ ఏడు థీమ్ ప్రకారం
    పచ్చిక బయల్లను పర్యావరణ వ్యవస్థను రక్షించడం .భూమి క్షీణతను( కోతను) నివారించడం . పశువుల పెంపకం దారుల జీవనోపాధికి మద్దతు ఇవ్వడంపై దృష్టి పెడుతుంది.


    పర్యావరణ వేత్తలు ఆందోళన
    భూమిపై జనాభా రోజురోజుకు పెరుగుతోంది .పెరుగుతున్న జనం అవసరాలు తీర్చడానికి ప్రకృతి ప్రసాదించిన నిర్మిత భూ భాగంలోనే అధిక ఉత్పత్తి చేపట్టాలి .దీనికోసం భూమి శాస్త్రీయ పరిశోధనలు ఫలితాలు ఉపయోగించి
    అధిక దిగిబడుల కోసం రసాయనిక ఎరువులు క్రిమి సంహారక మందులు జలవనరుల వినియోగం ప్రకృతి భరించలేని స్థాయిలో పెంచుకుంటు పోతున్నాం. 2014 సంవత్సరంలో150 కోట్ల హెక్టార్ల అటవీ భూములను చిత్తడి నేలలను పంట భూములుగా మార్చివేశాం 2050 సంవత్సరం నాటి కి భూవిస్తీర్ణం 10 శాతం వరకు పడిపోతుందని పర్యావరణ‌ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు.
    భూమి నిర్జీవమై ఎడారిగా మారుతుంది అడవులను చిత్తడి నేలను తోటలుగా' వ్యవసాయ భూములుగా మార్చడం వలన పొలాలు క్రమంగా భూసారాన్ని జీవాన్ని కోల్పోయి వ్యవసాయానికి పనికి రాకుండా పోతున్నాయి. పంటలు నిర్జీవమై భూమి ఎడారిగా మారి పోతుంది.
    ఎడారీకరణ కారణాలు
    జల వనరుల నిర్వహణ సక్రమంగా లేకపోవడం. జీవ భౌతిక 'ఆర్థిక పరిస్థితులు అనుకూలించక పోవడం వలన భూమి ఉత్పాదకత తగ్గి ఎడారీకరణ సంభవిస్తుంది. కరువులు వరదలు:ప్రకృతి విపత్తులు కూడా సహజవనరుల క్రమ క్షయానికి కారణమై నేలలను నిస్సారంగా మార్చి వేస్తున్నాయి. రసాయనిక ఎరువులు పురుగు మందుల వినియోగం విస్తృతం కావడం వల్ల నేలను గుల్ల పరుస్తున్నాయి. సహజంగా భూసారాన్ని పెంచే వాన పాములు తేనే టీగలు వంటి పంట సహాయ కారులు చనిపోతున్నాయి.వరదల సమయంలో భూమి పై సారవంతమైన మట్టి కొట్టుకుపోవడం చేత ఎడారీకరణ పెరుగుతుంది.
    పట్టణీకరణ పారిశ్రామికీకరణ
    నేడు ప్రపంచ వ్యాప్తంగా పట్టణీకరణ 'పారిశ్రామికీకరణ వేగంగా పెరుగుతుంది.
    ఇది భూమి క్షీణతకు దోహధపడుతుంది.భూమి క్రమంగా ఎడారిగా మారుతుందని భూతాపం పెరిగి భూమి ఉత్పాదక సామర్థ్యం దెబ్బతిని కరువు' కాటకాలు ఆకలి'చావులు సంభవిస్తున్నాయని పలు సామాజిక ఆర్థిక అద్యయనాలు వెల్లడిస్తున్నాయి.
    ఎడారీకరణ_ ప్రపంచ దేశాలకు సమస్య
    ఎడారీకరణ సమస్య ప్రపంచ దేశాలకు పెద్ధ సవాల్ గా పరిణమించింది. మానవుని స్వార్థ పూరిత చర్యలు తప్పిదాలు ప్రకృతి 'వాతావరణ మార్పులు ప్రకృతి విపత్తుల వల్ల భూమి ఉత్పాదకత తగ్గి ఎడారీకరణ పెరిగే ప్రమాదం వుంది. ఈ పరిస్తితి ఇలాగే కొనసాగితే విపత్కర పరిస్థితులు ఎదుర్కోవాల్సి వస్తుందని 'ఐ'రా'స హెచ్చరించింది.
    యూ' ఎన్:సీ'సీ'డీ అంచనాలు
    ఐ'రా'సకు చెందిన యూ'ఎన్ససి:సీ'డీ
    అంచనాల ప్రకారం వ్యవసాయానికి అనుకూలంగా లేని భూములను వ్యవసాయం కొరకు వినియోగించడం నేల' నీరు ' సంరక్షణ చర్యలు ఆశించనంతగ లేక పోవడం పరిమితికి మించి సాగు చేయడం నీటి యాజమాన్యం సక్రమంగా లేకపోవడం భూగర్భ జలాల అపరిమిత వినియోగం ఏడారీకరణకు కారణాలని పేర్కొంది.
    భూమి క్షీణత ఐ'రా'స నివేదిక
    ఏటా 530 కోట్ల ‌ టన్నుల సారవంతమైన మట్టి 80లక్షలు టన్నుల వృక్ష పోషకాలు నేల కోల్పోతుంది . భూక్షీణత వల్ల 25 కోట్లమంది ప్రభావిత మౌతున్నారు. ప్రతి యేటా 12 మిలియిన్ హెక్టార్ల భూమిని కోల్పోతున్నాం ప్రపంచ
    అటవీ విస్తర్ణం 13 మిలియ హెక్టార్ల భూమిని క్షీణిస్తుంది అని ఐ:రాస' నివేదికలో పేర్కొంది.ఈ ప్రభావం ప్రపంచ వ్యాప్తంగా 1.5 బిలియన్ ప్రజలను ప్రభావితం చేస్తుంది.
    ప్రపంచం లో వ్యవసాయం కోసం ఉపయోగించే పొడి భూముల్లో 70 శాతం వివిధ కారణాలతో అంతరించి పోతున్నాయి. ఆఫ్రికా ఖండంలో భూమి ఎడారిగా మారడం వల్ల గత 5 ఏళ్ల లో 60 మిలియన్ల మంది ప్రజలు వలస వెల్లుతున్నారు.
    భారత దేశం భూమి క్షీణత
    భారత దేశం భౌగోళిక ప్రాంతం 328 మిలియన్ల హెక్టార్ల లో దాదాపు 97.85మిలియను హెక్టార్ల(29.7 శాతం) భూమి ‍క్షీణతకు గురైంది.
    రాష్ట్రాలలో కేంద్ర పాలిత ప్రాంతాలలో
    28 రాష్ట్రాలలో భూమి ఎడారీకరణ అయ్యింది . ఇందులో 23.79 శాతం
    రాజస్థాన్ 'మహరాష్ట్ర 'గుజరాత్ కర్ణాటక' ఒడిషా' మధ్యప్రదేశ్ తెలంగాణలో ఎక్కువగా వుంది.
    రోడ్లు' భవనాలు నిర్మాణం 'గనుల తవ్వకం వల్ల వ్యవసాయం చెట్ల పెంపకానికి భూమి లభ్యత తగ్గిపోతుంది . ఎడారీకరణ మరింత పెరిగిందని ఐ'రా'స తమ‌ నివేదికలో తెలిపింది.
    ఆహార భద్రతకు ముప్పు ఎఢారీకరణ జరగడం వల్ల ప్రపంచ వ్యాప్తంగా ఆహార సమస్య ఏర్పడి వ్యాధులతో మరణించే వారికంటే ఎక్కువ సంఖ్యలో కరువుతో మరణించే ప్రమాదం వుందని హెచ్చరించింది. కరువు వల్ల మృత్యు వాత పడిన.వారి సంఖ్య అధికంగా వుంది.
    ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే 200 కోట్ల హెక్టార్ల భూమి సారాన్ని కోల్పోయింది .
    ప్రపంచ వ్యాప్తంగా ఇప్పటికే 360 కోట్ల హెక్టార్ల భూమి ఎడారీకరణ ప్రభావానికి గురైంది 3 వంతు భూమి ఎడారీకరణ ప్రమాదంలో వుంది.ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే రాబోయే 10 సం"ల లో మనుషులకు ఆహారం పంటలు పండించదానికి అదనంగా,30 కోట్ల హెక్టార్ల భూమి అవసరం పడుతుందని అంచనా.
    భూ క్షయం వల్ల 2010 లో ప్రపంచ స్థూల ఉత్పత్తి 10 శాతం తగ్గిందని ఆర్థిక సర్వేలు తెలుపుతున్నాయి.
    అంతరిక్ష పరిశోధనా సంస్థ అంచనా ప్రకారం 29.32 శాతం భూమి క్షయానికి గురైనట్లు గుర్తించింది. దేశములో 28 రాష్ట్రాలలో భూమి క్షీణత పెద్ద ఎత్తున కొనసాగుతుంది.ఎడారీకరణ పెరిగిపోతుందని ఐ'సి'ఎ'ఆర్ సంస్థ అద్యయనం ప్రకారం 2013 నాటికి ఎ 'పి 14.35 శాతం తెలంగాణ 31.4 శాతం 'కర్ణాటక 36.24 శాతం భూ భాగం ఎడారీకరణ ముప్పులో ఉన్నట్లు తెలిసింది. ఎ 'పి లోని అనంతరం తెలంగాణ లో నల్లగొండ జిల్లాలో అత్యధిక ఎడారీకరణ జరుగుతున్నట్లు అంచనాలు వున్నాయి.
    ప్రకృతి విధ్వంసాన్ని అరికట్టాలి.
    ప్రభుత్వాలు 'ప్రజలు ప్రకృతి విధ్వంసాన్ని అరికట్టాలి. మానవుడు తన స్వార్థం కోసం సహజ వనరులను సద్వినియోగం చేసుకోవాలి. సహజ వనరుల విధ్వంసాన్ని అరికట్టాలి .అనేక ప్రకృతివిపత్తులుసంభవిస్తున్నాయి.ఎడారీకరణపై అవగాహన
    ప్రపంచ దేశాల ప్రభుత్వాలు కరువు ఎడారీకరణ అంశాలపట్ల ప్రజలకు అవగాహన చైతన్యం కలిగించడానికి ఐ'రా'స 1994 జూన్ 17 వ తేదీ నుండి ఎడారీకరణ కరువు నివారణ దినోత్సవం నిర్వహిస్తుంది.
    సుస్థిరాభివృద్ధి
    సుస్థిరాభివృది లక్ష్యంగా అన్ని దేశాలు భూక్షీణత తటస్తీకరణతో పాటు అనేక కార్యక్రమాలు నిర్వహిస్తారు.
    ఎడారీకరణ నివారణ సమగ్ర చర్ర్యలు కేంద్ర 'రాష్ట్ర 'స్థానిక ప్రభుత్వాలు 'పౌర సమాజం సమిష్టిగా ఆరోగ్యకరమైన భూమిని నిర్మించాలి.
    1)నిరుపయోగ భూములను తిరిగి ‌శశ్య శ్యామలం చెయ్యాలి.
    2)సౌర శక్తి పవన శక్తి అందించాలన్న శాస్త్రవేత్తల సూచనల ప్రాతిపదికన కార్యాచరణకు ప్రభుత్వాలు పూనుకోవాలి
    3)భూమిని పునరుద్ధరణ వ్యూహాలను అమలుచేస్తే ఆర్థిక పరిస్థితిని మెరుగు పడుతుంది.నూతన ఉద్యోగ కల్పన జరిగి ఆహార భద్రత పెరుగుతుంది.
    4))జీవ వైవిధ్యాన్ని పునరుద్ధరించడానికి దోహద పడుతుంది. వాతావరణ ఉష్ణోగ్రతలు తగ్గుముఖం పట్టి భవిష్యత్ తరాల వారికి భూమి నివాస యోగ్యం అవుతుంది.
    5)అభివృధి చెందుతున్న దేశాలలో ఎడారీకరణ ముప్పు ఎక్కువ వుంది.
    ఎదారీకరణ అరికట్టాలంటే వ్యవసాయాన్ని పరిరక్షించాలి. నీటి కాలుష్యము వాయుకాలుస్య్యాన్ని అరికట్టాలి. 6)ప్రకృతి సహజ సంపదను రక్షించాలి. అడవులను నిర్మూలన అరికట్టాలి .రసాయన క్షిపణులు వాడకం తగ్గించాలి .యుధ్ధాలు జరుగకుండా జాగ్రత్త పడాలి.
    7)శరీరాన్ని ఆరోగ్యాన్ని రక్షించు కున్నట్లేఆహారాన్ని అందించే ప్రకృతి ప్రసాధిత భూమిని రక్షించుకోవాలి.
    ప్రపంచ దేశాలు రాబోయే దశాబ్దంలో బిలియన్ హెక్టార్ల. భూమిని పునరుద్ధరించాలని ఐ'రా'స పిలుపు నిచ్చింది. సుమారు చైనా దేశ‌ విస్తీర్ణం సమానంగా భూమి పునరుద్దరిస్తే మానవాళికి పుడుమికి ప్రయోజనం కలుగుతుంది.

    8) సమర్థవంతమైన భూమి నిర్వహణ పద్ధతులు పాటించాలి.
    సేంద్రియ.వ్యవసాయాన్ని ప్రోత్సహించాలి. పంట మార్పిడి విధానం అమలు చెయ్యాలి.వర్షపు నీటి సంరక్షణ ' ఇసుక కంచెలు ' షెల్టర్ బెల్టులు వుడ్ లాట్స్ విండ్ బ్రేక్స్ .ఉపయోగించి మట్టిని బట్టేస్ చేయడం జరగాలి.
    9)ఎడారులను సంపద సృష్టి కేంద్రాలుగా తీర్చిదిద్దాలి. ‌ఎడారి ప్రాంతాలలో నివసించే ప్రజలకు మౌలిక సదుపాయాలు కల్పించాలి.ప్రభుత్వం ఉచిత విద్య' వైద్యం 'రవాణ 'ఉపాధి కల్పనకు పెద్ద పీట వేయాలి.
    10) పథకాల అమలు భూవనరుల అభివృద్ధి సమీకృత బంజరు భూముల అభివృధి పథకం ' ఎడారి అభివృధి కార్యక్రమం
    అమలు అవుతున్న ప్రధాన మంత్రి కృషి సంచాయ్ యోజన జాతీయ గ్రామీణ ఉపాధి హామీ పథకం భూవనరుల అభివృధి దోహద పడుతున్నాయి.
    11) కొత్త అడవులను సృష్టించాలి. మైనింగ్ పేరుతో ప్రకృతిని దోచుకోవడం అరికట్టాలి. సామాజిక వనాలను పెంచాలి. 12)ప్రతి గ్రామం లో వృక్ష సంపద పెరగటానికి కృషి చెయ్యాలి.
    రసాయన క్షిపణులను తగ్గించాలి.
    13)ధరిత్రీ రక్షణ కోసం ప్రతి పౌరుడు కృషి చెయ్యాలి. "మన భూమిని మనమే రక్షించుకుందాం".ఆన్న ప్రతిజ్ఞ తోప్రతి పౌరుడు ముందుకు వెళ్లాలి భూరక్షణే జనరక్షణ నినాదం కాకుండా ప్రభుత్వాల విధానం కావాలని ఆశిద్దాం.
    14,)భవిష్యత్ తరాలకు భూసారాన్ని కానుకగా ఇద్దాం
    అని ప్రతిజ్ఞ చెయ్యాలి.
    ఎడారీకరణ కరువు నివారణ వ్యవస్థలను నిర్మించేందుకు కేంద్రం
    రాష్ట్ర ప్రభుత్వాలు చిత్తశుద్ధితో ముందడుగు వేయాలి. సుస్థిరాభివృధ్ది లక్ష్య సాధనకు పర్యావరణ హిత చర్యలు చేపట్టి భూ క్షీణతకు అడ్డుకట్ట వేయాలి.
    సేంద్రియ బాటపడుదాం భూసారాన్ని పెంచుదాం ప్రకృతితో చేతులు కలిపి ప్రగతి వైపు సాగుదాం మట్టిని రక్షిస్తే ఆ మట్టి
    మనల్ని పోషిస్తుంది. పుడమికి పునర్జీవనమే మానవ జాతికి శ్రీరామ రక్ష.

    నేదునూరి కనకయ్య
    అధ్యక్షులు
    తెలంగాణ ఎకనామిక్ ఫోరం
    సామాజిక ఆర్థిక అధ్యయన వేదిక
    కరీంనగర్ 9440245771