భూసార "పునరుద్ధరణ" తో మానవ మనుగడ
(జూన్17 న ప్రపంచ ఎడారీకరణ కరువు దినోత్సవం సందర్భంగా) నేలల తీరుతెన్నులే ప్రపంచ ఆహార భద్రత ను నిర్ణయిస్తాయి. భూమి లోని సహజ పోషకాలు వ్యవసాయానికి ఆవరణ వ్యవస్థకు ఉపయోగపడుతాయి. భూసారం సకల జీవ జాతులకు ఆహారం ఆవాసాన్ని అందించి మానవ నాగరికతకు పునాదిగా నిలుస్తుంది. భూమి ప్రకృతి ప్రసాదితం భూమిని పెంచలేము ఉన్న భూమిని సoరక్షించుకుంటేనే ఆర్థిక వ్యవస్థలో సుస్థిరాభివృద్ధి సాధ్యమవుతుంది. ఎడారీకరణ వ్యవసాయ యోగ్యమైన భూమి సారాన్ని కోల్పోవడమే ఎఢారీకరణ అంటారు. ఎడారులు వేరు ఎడారీకరణ వేరు భూ క్షీణతకు మరొక రూపమే ఎడారీకరణ .మానవుని చర్యలు వాతావరణం మార్పులు కారణంగా భూమి ఉత్పాదక సామర్థ్యం తగ్గిపోవడాన్ని ఎడారీకరణగా భావిస్తారు. భూమి మనుషులకే...