Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • పాస్‌పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ అవార్డు

    Author VENKATESH | 13 Jun 2026, 04:11 PM | TELANGANA, హైదరాబాద్
    పాస్‌పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ అవార్డు

    హైదరాబాద్, జూన్ 13: పాస్‌పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. దేశంలోనే ఉత్తమ పోలీసు ధ్రువీకరణ సేవలకు గాను ‘ఇన్‌స్టిట్యూషనల్ పెర్ఫార్మెన్స్ అవార్డు’ వరించింది. 2025-26 సంవత్సరంలో పాస్‌పోర్ట్ వెరిఫికేషన్‌లో అత్యుత్తమ పనితీరుకు గాను తెలంగాణ పోలీస్ శాఖకు ఈ అవార్డు లభించింది. ఈ మేరకు తెలంగాణ పోలీస్ శాఖను కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎంపిక చేసింది. ఈ అవార్డును అందుకోవాల్సిందిగా డీజీపీ సీవీ ఆనంద్‌కు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ఆహ్వానం పంపింది. జూన్ 19న న్యూఢిల్లీలో డీజీపీ ఈ అవార్డును అందుకోనున్నారు.

    కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జయశంకర్ చేతుల మీదుగా పురస్కార ప్రదానం జరుగనుంది. వేగవంతమైన, పారదర్శకమైన పోలీసు ధ్రువీకరణ సేవలకే ఈ గుర్తింపు లభించింది. సాంకేతిక ఆధారిత వెరిఫికేషన్ విధానం.. తెలంగాణ పోలీసులకు జాతీయ ఖ్యాతిని తెచ్చిపెట్టింది. ప్రజా కేంద్రిత సేవలు, సమర్ధవంతమైన పనితీరుకు మరో నిదర్శనంగా ఈ అవార్డు నిలిచింది. ఈ ఘనత దేశవ్యాప్తంగా తెలంగాణ పోలీస్ శాఖ ప్రతిష్ఠను మరింత పెంచింది. భవిష్యత్తులో మరింత మెరుగైన సేవలకు ఈ అవార్డు ప్రేరణగా నిలవనుంది.

    ఇవి కూడా చదవండి