పాస్‌పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ అవార్డు

హైదరాబాద్, జూన్ 13: పాస్‌పోర్ట్ సేవల్లో తెలంగాణ పోలీసులకు జాతీయ స్థాయి గుర్తింపు లభించింది. దేశంలోనే ఉత్తమ పోలీసు ధ్రువీకరణ సేవలకు గాను ‘ఇన్‌స్టిట్యూషనల్ పెర్ఫార్మెన్స్ అవార్డు’ వరించింది. 2025-26 సంవత్సరంలో పాస్‌పోర్ట్ వెరిఫికేషన్‌లో అత్యుత్తమ పనితీరుకు గాను తెలంగాణ పోలీస్ శాఖకు ఈ అవార్డు లభించింది. ఈ మేరకు తెలంగాణ పోలీస్ శాఖను కేంద్ర విదేశాంగ మంత్రిత్వ శాఖ ఎంపిక చేసింది. ఈ అవార్డును అందుకోవాల్సిందిగా డీజీపీ సీవీ ఆనంద్‌కు విదేశాంగ మంత్రిత్వ శాఖ అధికారిక ఆహ్వానం పంపింది. జూన్ 19న న్యూఢిల్లీలో డీజీపీ ఈ అవార్డును అందుకోనున్నారు. కేంద్ర విదేశాంగ మంత్రి ఎస్.జయశంకర్ చేతుల మీదుగా పురస్కార ప్రదానం జరుగనుంది. వేగవంతమైన, పారదర్శకమైన...