Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • నీట్ అభ్యర్థులకు అలర్ట్- జూన్ 21న ఎగ్జామ్- నిమిషం లేటైనా నో ఎంట్రీ

    Author VENKATESH | 13 Jun 2026, 01:16 PM | NATIONAL
    నీట్ అభ్యర్థులకు అలర్ట్- జూన్ 21న ఎగ్జామ్- నిమిషం లేటైనా నో ఎంట్రీ

    వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్‌ రీ-ఎగ్జామ్‌ 2026కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జూన్‌ 21న (ఆదివారం) జరగనున్న ఈ పరీక్షకు ముందు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) అభ్యర్థుల కోసం పరీక్ష రోజున పాటించాల్సిన టైమ్ లైన్ను విడుదల చేసింది. పరీక్షా కేంద్రాలకు ముందుగానే చేరుకోవాలని, అడ్మిట్‌ కార్డులో పేర్కొన్న సమయాలను తప్పనిసరిగా పాటించాలని సూచించింది.

    NTA వెల్లడించిన వివరాల ప్రకారం, పరీక్షా కేంద్రాల వద్ద అభ్యర్థుల ప్రవేశం, భద్రతా తనిఖీలు ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతాయి. పెద్ద సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యే అవకాశం ఉన్నందున భద్రతా తనిఖీలకు సమయం పట్టవచ్చని, చివరి నిమిషంలో కాకుండా ముందుగానే కేంద్రానికి చేరుకోవాలని సూచించింది. మధ్యాహ్నం 1:30 గంటలకు పరీక్షా కేంద్రం గేట్లు మూసివేస్తారు. ఆ తర్వాత ఎట్టి పరిస్థితుల్లోనూ అభ్యర్థులను అనుమతించబోమని స్పష్టం చేసింది. అలాగే మధ్యాహ్నం 1:40 గంటలలోపు ప్రతి అభ్యర్థి తనకు కేటాయించిన పరీక్షా హాలులోకి చేరుకోవాల్సి ఉంటుంది. ట్రాఫిక్‌, వాతావరణ పరిస్థితులు వంటి అంశాలను దృష్టిలో ఉంచుకుని ప్రయాణాన్ని ముందుగానే ప్రణాళిక చేసుకోవాలని NTA సూచించింది.