నీట్ అభ్యర్థులకు అలర్ట్- జూన్ 21న ఎగ్జామ్- నిమిషం లేటైనా నో ఎంట్రీ

వైద్య విద్యా కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్‌ రీ-ఎగ్జామ్‌ 2026కు ఏర్పాట్లు పూర్తయ్యాయి. జూన్‌ 21న (ఆదివారం) జరగనున్న ఈ పరీక్షకు ముందు నేషనల్‌ టెస్టింగ్‌ ఏజెన్సీ (NTA) అభ్యర్థుల కోసం పరీక్ష రోజున పాటించాల్సిన టైమ్ లైన్ను విడుదల చేసింది. పరీక్షా కేంద్రాలకు ముందుగానే చేరుకోవాలని, అడ్మిట్‌ కార్డులో పేర్కొన్న సమయాలను తప్పనిసరిగా పాటించాలని సూచించింది. NTA వెల్లడించిన వివరాల ప్రకారం, పరీక్షా కేంద్రాల వద్ద అభ్యర్థుల ప్రవేశం, భద్రతా తనిఖీలు ఉదయం 11 గంటలకు ప్రారంభమవుతాయి. పెద్ద సంఖ్యలో విద్యార్థులు హాజరయ్యే అవకాశం ఉన్నందున భద్రతా తనిఖీలకు సమయం పట్టవచ్చని, చివరి నిమిషంలో కాకుండా ముందుగానే కేంద్రానికి చేరుకోవాలని సూచించింది. మధ్యాహ్నం 1:30...