Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • వారాంతపు మార్కెట్ యార్డ్ ను సద్వినియోగం చేసుకోవాలి

    Author VENKATESH | 12 Jun 2026, 04:42 PM | EDITORIAL
    వారాంతపు మార్కెట్ యార్డ్ ను సద్వినియోగం చేసుకోవాలి

    - పేట లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను పునః ప్రారంభించిన కలెక్టర్ సీ హెచ్ ప్రియాంక

    నారాయణపేట జిల్లా , జూన్ 12 ( బి వి కే న్యూస్)

    వారాంతపు మార్కెట్ యార్డ్ ను జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సీ హెచ్ ప్రియాంక కోరారు. శుక్రవారం నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ (సమీకృత మార్కెట్) యార్డును జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి శుక్రవారం సమీకృత మార్కెట్ యార్డులో వివిధ రకాల సేంద్రీయ కూరగాయలు పండ్లు పూల ఉత్పత్తులు ఆహార ధాన్యాలు మహిళా సంఘాల ఉత్పత్తులు రాగి లడ్డూలు జనపనార సంచులు మట్టి కుండలు మట్టి ఆభరణాలు పచ్చళ్ళు వెదురు ఉత్పత్తులు చేనేత చీరలు హస్తకళ ఉత్పత్తులు కళాకారుల కుమ్మరి ఉత్పత్తులు జనపనార తదితర వస్తువుల స్టాల్స్ ఏర్పాటు చేయడం జరుగుతుందని తెలిపారు. ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను ప్రారంభించటానికి ముఖ్య ఉద్దేశ్యం నిరుపయోగంగా ఉన్న ఇంటిగ్రేటెడ్ మార్కెట్ సముదాయాన్ని వినియోగంలోకి తీసుకు రావడంతో పాటు జిల్లాలో ప్రకృతి వ్యవసాయం ద్వారా రైతులు పండించిన పంట ఉత్పత్తులను మార్కెటింగ్ చేయడానికి అని తెలిపారు. సేంద్రీయ ఎరువులు తయారీ వాటి ప్రదర్శన అమ్మకాలు స్థానిక ఉత్పత్తులకు ప్రోత్సాహం కల్పించడంతో పాటు ఆన్ లైన్ ద్వారా అమ్మకాలు జరిగేలా కృషి చేస్తున్నట్లు తెలిపారు. మహిళా స్వయం సహాయక సంఘాల ఆధ్వర్యంలో తయారు చేసే ఉత్పత్తులు వాటిని ప్రజలు ఆదరించేలా తగు చర్యలు తీసుకుంటామని తెలిపారు. వారం లో ఒక శుక్రవారం ఇక్కడి ఇంటిగ్రేటెడ్ మార్కెట్ సముదాయంలో ఆయా ఉత్పత్తులు అందుబాటులో ఉంటాయని, జిల్లా ప్రజలు వారంతపు మార్కెట్ ను ఉపయోగించుకుని రసాయనాలు లేని ఆహార ఉత్పత్తులు కొని ఆరోగ్యాన్ని కాపాడుకోవాలని కలెక్టర్ సూచించారు. మున్సిపాలిటీ కమిషనర్, డిఆర్డిఏ , హార్టికల్చర్, అగ్రికల్చర్ అధికారులు సమన్వయంతో ప్రతి శుక్రవారం ఇక్కడ స్టాల్స్ ఏర్పాటు చేయించి మహిళా స్వయం సహాయక సంఘాలు ఆర్థికంగా బలోపేతం అయ్యేలా ప్రోత్సహించాలని ఆదేశించారు.
    ఈ కార్యక్రమంలో డీఆర్డీడీఏ వెంకట్ రాములు, జిల్లా వ్యవసాయ అధికారి సక్రియ నాయక్, హార్టికల్చర్ అధికారి సాయిబాబా, పుర కమీషనర్ శంకర్, మార్కెట్ చైర్మన్ శివారెడ్డి, పుర వైస్ చైర్ పర్సన్ మంజుల, బిజెపి జిల్లా అధ్యక్షుడు సత్య యాదవ్, వార్డు కౌన్సిలర్ కందేన్ పల్లి సత్యమ్మ, కౌన్సిలర్ భరత్, జిల్లా మహిళా సమాఖ్య అధ్యక్షు రాలు అరుంధతి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మెన్ బండి వేణుగోపాల్, తదితరులు పాల్గొన్నారు.

    ఇవి కూడా చదవండి