వారాంతపు మార్కెట్ యార్డ్ ను సద్వినియోగం చేసుకోవాలి

- పేట లో ఇంటిగ్రేటెడ్ మార్కెట్ ను పునః ప్రారంభించిన కలెక్టర్ సీ హెచ్ ప్రియాంక నారాయణపేట జిల్లా , జూన్ 12 ( బి వి కే న్యూస్) వారాంతపు మార్కెట్ యార్డ్ ను జిల్లా ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని జిల్లా కలెక్టర్ సీ హెచ్ ప్రియాంక కోరారు. శుక్రవారం నారాయణపేట జిల్లా కేంద్రంలోని ఇంటిగ్రేటెడ్ మార్కెట్ (సమీకృత మార్కెట్) యార్డును జిల్లా కలెక్టర్ ప్రారంభించారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ ప్రతి శుక్రవారం సమీకృత మార్కెట్ యార్డులో వివిధ రకాల సేంద్రీయ కూరగాయలు పండ్లు పూల ఉత్పత్తులు ఆహార ధాన్యాలు మహిళా సంఘాల ఉత్పత్తులు రాగి లడ్డూలు జనపనార సంచులు మట్టి...