Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • హైదరాబాద్ కోర్ సిటీకి మరో భారీ ఫ్లైఓవర్.. అసెంబ్లీ వెనుక ‘వై’ ఆకారపు వంతెన.. ఇక ట్రాఫిక్ కష్టాలకు చెక్!

    Author VENKATESH | 12 Jun 2026, 12:52 PM | TELANGANA
    హైదరాబాద్ కోర్ సిటీకి మరో భారీ ఫ్లైఓవర్.. అసెంబ్లీ వెనుక ‘వై’ ఆకారపు వంతెన.. ఇక ట్రాఫిక్ కష్టాలకు చెక్!

    హైదరాబాద్‌లో రోజురోజుకూ పెరిగిపోతున్న ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా కోర్ సిటీ పరిధిలోని నాంపల్లి, అసెంబ్లీ, లక్డీకాపూల్ మార్గాల్లో నిత్యం నరకంగా మారుతున్న వాహనాల రద్దీని నియంత్రించడానికి సరికొత్త ఫ్లైఓవర్ నిర్మాణాన్ని ప్రతిపాదించింది. పబ్లిక్ గార్డెన్ నుంచి అసెంబ్లీ వెనుక వైపుగా లక్డీకాపూల్ వరకు దాదాపు 1.5 కిలోమీటర్ల పొడవున ఆంగ్ల అక్షరం 'Y' (వై) ఆకారంలో నిర్మించ తలపెట్టిన ఈ వంతెనకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) ప్రణాళికలు, డిజైన్లను సిద్ధం చేసింది.


    ప్రభుత్వ భూముల్లోనే నిర్మాణం.. భూసేకరణ వివాదాలకు స్వస్తి!
    సాధారణంగా నగరంలో ఫ్లైఓవర్ల నిర్మాణాల సమయంలో ప్రైవేటు ఆస్తుల సేకరణ పెద్ద సవాలుగా మారుతోంది. భూసేకరణ కారణంగా కోర్టు కేసులు, పరిహారం వివాదాలు తలెత్తి ప్రాజెక్టులు ఏళ్ల తరబడి ఆలస్యం అవుతున్నాయి. ఈ చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకుని.. ఈ ప్రతిపాదిత వంతెనను గరిష్ఠంగా ప్రభుత్వ భూముల్లోనే నిర్మించేలా అధికారులు చాకచక్యంగా ప్లాన్ చేశారు. ఇందుకోసం క్షేత్రస్థాయిలో హెచ్ఎండీఏ ఇప్పటికే సమగ్ర సర్వేను పూర్తి చేసింది. దాదాపు 99 శాతం వరకు ప్రభుత్వ ఆస్తులను కేటాయించింది. ముఖ్యంగా ప్రైవేటు ఆస్తుల అవసరం ఎక్కువగా లేకుండా, ఎక్కడా వివాదాలకు తావులేకుండా ఈ ఫ్లైఓవర్ అలైన్‌మెంట్‌ను రూపొందించింది.

    రూట్ మ్యాప్, అలైన్‌మెంట్ వివరాలు..
    ఈ ప్రతిపాదిత ఫ్లైఓవర్ నాంపల్లిలోని పొట్టి శ్రీరాములు తెలుగు యూనివర్సిటీ ముందు భాగం నుంచి ప్రారంభం అవుతుంది. అక్కడ నుంచి పబ్లిక్ గార్డెన్ మీదుగా, అసెంబ్లీ వెనుక వైపు నుంచి రైల్వే లైన్ వెంబడి ముందుకు సాగుతుంది. లక్డీకాపూల్ వద్దకు చేరుకోగానే ఈ వంతెన రైల్వే లైన్ మీదుగా ప్రయాణించి లక్డీకాపూల్ జంక్షన్‌ను దాటుతుంది. ఇక్కడే అసలు ఇంజినీరింగ్ అద్భుతం జరగనుంది. జంక్షన్ దాటిన తర్వాత ఈ ఫ్లైఓవర్ రెండుగా చీలిపోతుంది. అంటే 'వై' షేప్‌గా మారుతుంది. ఇందులో ఒక మార్గం నేరుగా మాసబ్ ట్యాంక్ వైపు వెళ్లే రహదారికి, మరో మార్గం ఖైరతాబాద్ వైపు వెళ్లే రహదారికి అనుసంధానం అవుతుంది. సైఫాబాద్ పోలీస్ స్టేషన్ కంటే ముందే లక్డీకాపూల్ ప్రధాన రహదారిపై ఈ వంతెన ల్యాండ్ అయ్యేలా డిజైన్ చేశారు.

    ఇవి కూడా చదవండి