హైదరాబాద్ కోర్ సిటీకి మరో భారీ ఫ్లైఓవర్.. అసెంబ్లీ వెనుక ‘వై’ ఆకారపు వంతెన.. ఇక ట్రాఫిక్ కష్టాలకు చెక్!
హైదరాబాద్‌లో రోజురోజుకూ పెరిగిపోతున్న ట్రాఫిక్ కష్టాలకు చెక్ పెట్టేందుకు రాష్ట్ర ప్రభుత్వం మరో ప్రతిష్టాత్మక ప్రాజెక్టుకు శ్రీకారం చుట్టింది. ముఖ్యంగా కోర్ సిటీ పరిధిలోని నాంపల్లి, అసెంబ్లీ, లక్డీకాపూల్ మార్గాల్లో నిత్యం నరకంగా మారుతున్న వాహనాల రద్దీని నియంత్రించడానికి సరికొత్త ఫ్లైఓవర్ నిర్మాణాన్ని ప్రతిపాదించింది. పబ్లిక్ గార్డెన్ నుంచి అసెంబ్లీ వెనుక వైపుగా లక్డీకాపూల్ వరకు దాదాపు 1.5 కిలోమీటర్ల పొడవున ఆంగ్ల అక్షరం 'Y' (వై) ఆకారంలో నిర్మించ తలపెట్టిన ఈ వంతెనకు హైదరాబాద్ మెట్రోపాలిటన్ డెవలప్‌మెంట్ అథారిటీ (హెచ్ఎండీఏ) ప్రణాళికలు, డిజైన్లను సిద్ధం చేసింది. ప్రభుత్వ భూముల్లోనే నిర్మాణం.. భూసేకరణ వివాదాలకు స్వస్తి! సాధారణంగా నగరంలో ఫ్లైఓవర్ల నిర్మాణాల సమయంలో ప్రైవేటు ఆస్తుల...