Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • 'పరీక్షల మేనిఫెస్టో'ను ప్రకటించిన CJP- దేశవ్యాప్త నిరసనలు ప్రారంభం

    Author VENKATESH | 12 Jun 2026, 12:29 PM | TELANGANA, హైదరాబాద్
    'పరీక్షల మేనిఫెస్టో'ను ప్రకటించిన CJP- దేశవ్యాప్త నిరసనలు ప్రారంభం

    నీట్​ పేపర్​ లీక్​ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్త ఆందోళనను ప్రారంభించింది కాక్రోచ్​ జనతా పార్టీ. ఇందులో భాగంగా మహారాష్ట్రలోని సావిత్రిబాయి ఫూలే పుణె విశ్వవిద్యాలయం ప్రాంగణంలో జరిగిన నిరసనలో వందలాది మంది విద్యార్థులు, సీజేపీ అనుచరులు పాల్గొన్నారు. ఈ క్రమంలోనే విద్యార్థులకు నష్టపరిహారం చెల్లించాలంటూ ఒక 'పరీక్షల మేనిఫెస్టో'ను విడుదల చేశారు సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే. పేపర్ లీక్ అయినా, పరీక్షలు వాయిదా పడినా లేదా ఫలితాల ప్రకటనలో జాప్యం జరిగినా విద్యార్థులకు రూ.10,000 పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. భారీ నియామక ప్రక్రియల సమయంలో ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాలని కోరారు. రద్దయిన పరీక్షలను 72 గంటల్లోగా నిర్వహించేందుకు వీలుగా ప్రతి పరీక్షకు ఒక ప్రత్యామ్నాయ తేదీని కేటాయించాలని దీప్కే అన్నారు.

    పేపర్ లీక్ అయినా, పరీక్షలు వాయిదా పడినా లేదా ఫలితాల ప్రకటనలో జాప్యం జరిగినా విద్యార్థులకు రూ.10,000 పరిహారం అందాలి.
    భారీ నియామక ప్రక్రియల సమయంలో ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాలి.
    రద్దయిన పరీక్షలను 72 గంటల్లోగా నిర్వహించేందుకు వీలుగా ప్రతి పరీక్షకు ఒక ప్రత్యామ్నాయ తేదీని కేటాయించాలి.
    ఆన్‌లైన్ అసెస్‌మెంట్‌కు బదులుగా జవాబు పత్రాల భౌతిక మూల్యాంకనం చేయాలి.
    పరీక్షలు లేదా ఫలితాలు ఆలస్యం కావడం వల్ల ప్రభావితమైన అభ్యర్థులకు వయో సడలింపు ఇవ్వాలి.
    పరీక్షలకు ముందు కంప్యూటర్ ఆధారిత పరీక్షా వ్యవస్థల తప్పనిసరి ఆడిట్‌లు నిర్వహించాలి. పరీక్షల నిర్వహణకు సంబంధించిన కాంట్రాక్టులను పూర్తిగా అర్హత (మెరిట్) ఆధారంగానే కేటాయించాలి.
    దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద జరిగిన నిరసనలో పాల్గొన్న ఒక ఉపాధ్యాయుడిని సస్పెండ్ చేశారని ఆరోపించారు. పరీక్షల అవకతవకలకు బాధ్యులైన వారిపై సకాలంలో చర్యలు తీసుకుని ఉంటే దేశవ్యాప్త ఆందోళనలు చేపట్టే అవసరం ఉండేది కాదన్నారు. CJP మద్దతుదారులను "పాకిస్థానీయులు"గా ముద్ర వేయడానికి జరుగుతున్న ప్రయత్నాలను కూడా దిప్కే తప్పుబట్టారు. గత దశాబ్ద కాలంగా ప్రజా చర్చ అంతా మతపరమైన అంశాల చుట్టూనే తిరుగుతోందని దిప్కే అన్నారు.

    "ఈ ఉద్యమం ప్రారంభమైనప్పటి నుంచి మా ఏకైక డిమాండ్ ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయడమే. కోటి మందికి పైగా విద్యార్థులు అన్యాయానికి గురయ్యారు. కానీ బాధ్యత తీసుకోవడానికి లేదా పదవి నుంచి తప్పుకోవడానికి ఎవరూ సిద్ధంగా లేరు. కోటి మంది విద్యార్థులు ముఖ్యమా లేక ఒక అసమర్థ మంత్రి ముఖ్యమా? అని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నిర్ణయించుకోవాలి. హిందూ-ముస్లిం విభజనల ఆధారంగా సాగే రాజకీయాలకు తావు లేకుండా చూడటం మన బాధ్యత. ఇలాంటి అంశాలపై దృష్టి మళ్లడం వల్లే అభివృద్ధి కుంటుపడింది. దేశంలోని యువత ఈ రాజకీయాలతో విసిగిపోయిందనడానికి బొద్దింక ఒక సంకేతం. వ్యవస్థ పూర్తిగా పాడైపోయింది, ఆ బొద్దింకలే దానిని సరిదిద్దుతాయి." అని ఆయన అన్నారు.

    ఇవి కూడా చదవండి

    ఈ నిరసనలో పాల్గొన్న పర్యావరణ కార్యకర్త సోనమ్ వాంగ్‌చుక్, దీప్కే నేతృత్వంలోని ఉద్యమానికి మద్దతు ప్రకటించారు. విద్యా రంగంలోని సమస్యలపై దృష్టి సారించేందుకు ఒక విద్యావంతుడైన యువకుడు చేస్తున్న ప్రయత్నంగా ఆయన అభివర్ణించారు.

    అంతకుముందు జరిగిన విలేకరుల సమావేశంలో మాట్లాడిన సీజేపీ వ్యవస్థాపకుడు దీప్కే, ఈ నిరసన శాంతియుతంగా, రాజ్యాంగ పరిధిలోనే సాగుతుందని హామీ ఇచ్చారు. పూణె నుంచి దేశవ్యాప్త ప్రచారాన్ని ప్రారంభించి, జైపుర్, లఖ్​నవూ, అమృత్‌సర్, బెంగళూరు వంటి నగరాలకు ఈ ఉద్యమాన్ని విస్తరిస్తామన్నారు. శుక్రవారం లఖ్​నవూలోని ఎకో గార్డెన్‌లో నిరసన జరగనుందని తెలిపారు. ఆ తర్వాత జూన్ 20న దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద సమావేశమవుతామని ఆయన చెప్పారు. ప్రభుత్వంతో చర్చలకు తాము సిద్ధంగా ఉన్నామని, కానీ చర్చలకు బదులుగా ప్రభుత్వం CJP సోషల్ మీడియా ఖాతాలను నిలిపివేస్తోందని ఆయన ఆరోపించారు.