'పరీక్షల మేనిఫెస్టో'ను ప్రకటించిన CJP- దేశవ్యాప్త నిరసనలు ప్రారంభం

నీట్​ పేపర్​ లీక్​ నేపథ్యంలో కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ దేశవ్యాప్త ఆందోళనను ప్రారంభించింది కాక్రోచ్​ జనతా పార్టీ. ఇందులో భాగంగా మహారాష్ట్రలోని సావిత్రిబాయి ఫూలే పుణె విశ్వవిద్యాలయం ప్రాంగణంలో జరిగిన నిరసనలో వందలాది మంది విద్యార్థులు, సీజేపీ అనుచరులు పాల్గొన్నారు. ఈ క్రమంలోనే విద్యార్థులకు నష్టపరిహారం చెల్లించాలంటూ ఒక 'పరీక్షల మేనిఫెస్టో'ను విడుదల చేశారు సీజేపీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే. పేపర్ లీక్ అయినా, పరీక్షలు వాయిదా పడినా లేదా ఫలితాల ప్రకటనలో జాప్యం జరిగినా విద్యార్థులకు రూ.10,000 పరిహారం ఇవ్వాలని ఆయన డిమాండ్ చేశారు. భారీ నియామక ప్రక్రియల సమయంలో ప్రత్యేక రైళ్లను ఏర్పాటు చేయాలని...