Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • 'యూనియన్‌ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం' : నిరుద్యోగుల పాలిట కల్పతరువు!

    Author VENKATESH | 12 Jun 2026, 12:18 PM | TELANGANA, హైదరాబాద్
    'యూనియన్‌ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం' : నిరుద్యోగుల పాలిట కల్పతరువు!

    గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి లేక, వ్యాపారాలు చేయడానికి సరైన నైపుణ్యాలు కొరవడి ఎంతో మంది యువత నిరాశపడుతున్నారు. అవకాశాల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అలాంటి వారి పాలిట కల్పతరువుగా మారింది యూనియన్‌ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం. నిరుద్యోగులకు శిక్షణ ఇస్తూ అవకాశాల దారిని చూపిస్తోంది. వారిలో ఆత్మవిశ్వాసం నింపి ధైర్యంగా నిలబెడుతోంది.

    పలు వస్తువుల తయారీపై శిక్షణ : నిరుద్యోగ యువతీయువకులకు శిక్షణ ఇచ్చి స్వయం ఉపాధి పొందేలా బ్యాంకులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది 9 శిక్షణ కేంద్రాలు నడుస్తున్నాయి. ఇందులో ఏడు యూనియన్‌ బ్యాంకు ఆధ్వర్యంలోనే కొనసాగుతున్నాయి. జగిత్యాలలో గత నెలలో ప్రారంభమైన యూనియన్‌ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం నిరుద్యోగులకు అవకాశాల గనిగా మారింది. ఇక్కడ శిక్షణతో పాటు బ్యాంకు రుణాలు అందించి చిరు వ్యాపారాలు నిర్వహించుకునేలా ప్రొత్సహిస్తున్నారు. తొలి బ్యాచ్‌లో ఇమిటేషన్‌ జ్యువెల్లరీలో భాగంగా గాజులు, చెవి కమ్మలు, రింగులు సహా పలు వస్తువుల తయారీపై 14 రోజుల పాటు మెళకువలు నేర్పించారు. ప్రస్తుతం రెండో బ్యాచ్‌లో 50 మందికి మగ్గం, ఎంబ్రాయిడరీ, ఫ్యాబ్రిక్‌ పెయింట్‌పై 31 రోజుల శిక్షణ కొనసాగుతోంది. ఈ కార్యక్రమం తమ స్వయం ఉపాధికి బాటలు వేసిందని అభ్యర్థులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు.

    "నా కాళ్లపై నేను నిలబడటానికి ఏదైనా అవకాశం వస్తుందేమోనని ఇన్ని రోజులు చూశాను. బయట స్నేహితుల ద్వారా దీని గురించి తెలుసుకుని ఇక్కడకు వచ్చాను. ఇక్కడకు వచ్చాక నేను చేయగలను అనే నమ్మకం కలిగింది. ఇక్కడకు వచ్చాక ఫస్ట్​ నాకు మాట్లాడటానికి కూడా ధైర్యం రాలేదు. కానీ ఇక్కడికి వచ్చాక సార్​ వాళ్లు ప్రోత్సహించటం వల్ల నాలో ఆత్మవిశ్వాసం పెరిగింది. ఇంకా ఇక్కడ వర్క్​తో పాటు స్కిల్స్​ కూడా చాలా నేర్చుకోవచ్చని అర్థమయ్యింది. నేను ఇక్కడకు వచ్చాక చాలా నేర్చుకున్నాను" - ఓ యువకుడు

    ఇవి కూడా చదవండి

    అవసరమైన శిక్షణ కోసం ప్రణాళికలు : 78 రకాల కోర్సులపై శిక్షణ ఇవ్వాలని నిర్ణయించగా, ప్రస్తుతం ఇక్కడ 13 కోర్సుల్లో శిక్షణ ఇవ్వనున్నారు. బ్యూటీ పార్లర్‌, జ్యూట్‌ బ్యాగుల తయారీ, పుట్టగొడుగుల పెంపకం, టైలరింగ్‌, సీసీ కెమెరాల రిపేరింగ్‌, ఫొటోగ్రఫీ, ఎలక్ట్రీషియన్‌ వర్క్‌పై యువతీయువకులకు అవసరమైన శిక్షణ ఇచ్చేలా ప్రణాళికలు సిద్ధం చేశారు.

    "ఈ కాన్సెప్ట్​ ముఖ్య ఉద్దేశం ఏంటంటే రూరల్​ పీపుల్​ అంటే ఎడ్యుకేషన్​ కంప్లీట్​ అయ్యి లేదా ఫెయిల్ అయ్యి ఎలాంటి ఉద్యోగం దొరకకుండా ఉన్న యువతకు వారికి ఇష్టమున్న సబ్జెక్ట్​లో వారికి ట్రైనింగ్​ ఇస్తున్నాం. వారికి భవిష్యత్తులో ఏవైనా లోన్లు కావాలన్నా మేమే ఇవ్వటం, అలాగే వారు సక్సెస్​ అయ్యే వరకు మేమే తోడుగా ఉంటాం. వారు జీవితంలో పైకి రావటం కోసం మేము ప్రయత్నం చేస్తున్నాం. రెండు సంవత్సరాలు మేమే చూసుకుంటాం. వీరికి కోర్స్​ కూడా ఫ్రీ. అలాగే ఉచిత ఫుడ్​, వసతిని అందిస్తాం. మనకు 70 శాతం వరకు ప్రాక్టికల్​ క్లాస్​లు ఉంటాయి. అలాగే బిజినెస్​ పరంగా ఎలా ఎదగవచ్చు అని 30 శాతం థియరీ క్లాసులు చెప్తారు