'యూనియన్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం' : నిరుద్యోగుల పాలిట కల్పతరువు!
గ్రామీణ ప్రాంతాల్లో ఉపాధి లేక, వ్యాపారాలు చేయడానికి సరైన నైపుణ్యాలు కొరవడి ఎంతో మంది యువత నిరాశపడుతున్నారు. అవకాశాల కోసం ఎంతగానో ఎదురు చూస్తున్నారు. అలాంటి వారి పాలిట కల్పతరువుగా మారింది యూనియన్ గ్రామీణ స్వయం ఉపాధి శిక్షణ కేంద్రం. నిరుద్యోగులకు శిక్షణ ఇస్తూ అవకాశాల దారిని చూపిస్తోంది. వారిలో ఆత్మవిశ్వాసం నింపి ధైర్యంగా నిలబెడుతోంది. పలు వస్తువుల తయారీపై శిక్షణ : నిరుద్యోగ యువతీయువకులకు శిక్షణ ఇచ్చి స్వయం ఉపాధి పొందేలా బ్యాంకులు ప్రత్యేక కార్యక్రమాలు నిర్వహిస్తున్నాయి. ఇందులో భాగంగా రాష్ట్రవ్యాప్తంగా ఈ ఏడాది 9 శిక్షణ కేంద్రాలు నడుస్తున్నాయి. ఇందులో ఏడు యూనియన్ బ్యాంకు ఆధ్వర్యంలోనే కొనసాగుతున్నాయి. జగిత్యాలలో గత నెలలో ప్రారంభమైన...