Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • యోగ ఆరోగ్య సంజీవని

    Author VENKATESH | 11 Jun 2026, 04:35 PM | EDITORIAL
    యోగ ఆరోగ్య సంజీవని

    శరీర మనసుల బంధం యోగం
    నిత్యం చేస్తే తీరును రోగం
    ప్రాణాయామపు శ్వాసల వేగం
    అందించునులే కొండంత బలం

    ఆసనములతో కాయముకరుగును
    ఆందోళనలన్నీ దూరం జరుగును
    శ్వాసపై ధ్యాసతో మనో స్థిరత్వం
    సిద్ధించును

    ధ్యానం మెదడుకు చోదక శక్తి
    జ్ఞాపక శక్తి సామర్థ్యాలు
    ఉత్తేజితమై నిర్మలత్వం
    నిర్మాణమై చైతన్యం జనిస్తుంది
    ఆరోగ్యపు బాటలోముందుకు
    సాగుదాం ఆరోగ్యభారత్ ను
    నిర్మిద్దాం

    నిత్య సూర్యనమస్కారాల
    సాధన తోడుగా
    ఆలస్యం వదిలి సాగాలి
    యోగాలో ముందుగా
    రక్త ప్రసరణ సాగును చక్కగా
    కండరాలన్నీ కదులును మెత్తగా

    నరముల బలహీనత తగ్గును
    నిశ్చలతత్వం చెంతకు చేరును
    ఆయుషును పెంచే అమృత
    యోగం శరీర ఆకృతికి
    ఆనందాన్నిచే అద్భుత మార్గం

    యోగ ధ్యానంతోఒత్తిడి
    మాయం మనోల్లాసం
    వికసిస్తుంది

    ఇవి కూడా చదవండి


    యోగ సాధనతో శరీర
    మానసిక ఉత్సాహం
    ఉల్లాసం ఉరకలు వేస్తుంది

    ఉదయం యోగ జగతికి
    అమృత కావ్యం కావాలి
    ప్రతిఇంటా యోగా ధ్యానం
    నిత్య కృత్యం కావాలి

    2026 అంతర్జాతీయ
    యోగ దినోత్సవం థీమ్
    ఆరోగ్యకరమైన వృద్ధాప్యం
    కోసం యోగా
    వయసుపై బడిన లొంగని
    ధీరత్వం అందించును
    మనకు యోగామృతం
    ఆరోగ్యకరమైన వృద్ధాప్యమే
    ఈ ఏటి నినాదం
    నిత్య సాధనతో లభించును
    నవయవ్వన ఉత్తేజం
    రోగాల మందులకై వెతుకద్దు
    నిత్య యోగయేఆరోగ్య సంజీవని


    జూన్ ఇరవైఒక్కటవ తేదీన
    ప్రపంచమంతా ఒక్కటైనవేళ
    అంతర్జాతీయ యోగా దినోత్సవం
    మన భారతీయ సంస్కృతి
    వైభవాన్ని వసుధైక కుటుంబకం
    భావాన్ని విశ్వ వ్యాప్తంచేద్దాం


    విశ్వమంతా యోగ నినాదం
    జీవన విధానమై అందించును
    మానవాళికి ఆరోగ్యం
    జాతి మతబేధాలన్నీ మరిచి
    సాగుదాం యోగ బాటలో
    అందరికి ఆరోగ్యం అందించే
    యోగ ధ్యానమే జీవనశైలిగా
    ముందుకు సాగుదాం
    యోగ ధ్యాన యజ్ఞంలో
    భాగస్వాములమై
    ఆరోగ్య భారత్ ను
    ఆవిష్కరిద్ధాం.

    నేదునూరి కనకయ్య
    అత్తాపూర్ యోగ సెంటర్
    అడ్వైసర్
    హైదరాబాద్
    9440245771