యోగ ఆరోగ్య సంజీవని

శరీర మనసుల బంధం యోగం నిత్యం చేస్తే తీరును రోగం ప్రాణాయామపు శ్వాసల వేగం అందించునులే కొండంత బలం ఆసనములతో కాయముకరుగును ఆందోళనలన్నీ దూరం జరుగును శ్వాసపై ధ్యాసతో మనో స్థిరత్వం సిద్ధించును ధ్యానం మెదడుకు చోదక శక్తి జ్ఞాపక శక్తి సామర్థ్యాలు ఉత్తేజితమై నిర్మలత్వం నిర్మాణమై చైతన్యం జనిస్తుంది ఆరోగ్యపు బాటలోముందుకు సాగుదాం ఆరోగ్యభారత్ ను నిర్మిద్దాం నిత్య సూర్యనమస్కారాల సాధన తోడుగా ఆలస్యం వదిలి సాగాలి యోగాలో ముందుగా రక్త ప్రసరణ సాగును చక్కగా కండరాలన్నీ కదులును మెత్తగా నరముల బలహీనత తగ్గును నిశ్చలతత్వం చెంతకు చేరును ఆయుషును పెంచే అమృత యోగం శరీర ఆకృతికి ఆనందాన్నిచే అద్భుత మార్గం యోగ ధ్యానంతోఒత్తిడి...