Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • ఉన్నత లక్ష్యాల సాధనకు క్రమశిక్షణ కలిగిన జీవనశైలి ప్రధానం

    Author VENKATESH | 11 Jun 2026, 04:34 PM | EDITORIAL
    ఉన్నత లక్ష్యాల సాధనకు క్రమశిక్షణ కలిగిన జీవనశైలి ప్రధానం

    - లయన్‌ కెప్టెన్ డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి, రచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణులు

    తాను నిర్దిష్టంగా ఎంచుకున్న లక్ష్యాల సాధనకు వారి క్రమశిక్షణ కలిగిన జీవనశైలి దోహదపడుతుందని ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు, కాలమిస్ట్‌, రచయిత, విశ్రాంత ప్రిన్సిపాల్, పూర్వ ఎన్‌సిసి కంపెనీ కమాండర్ లయన్ కెప్టెన్ డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ రోజు తిమ్మపూర్‌ సమీప జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో జరుగుతున్న సంయుక్త వార్షిక శిక్షణా శిబిరంలో కెడెట్లను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి వ్యక్తి జీవితంలో వ్యక్తిగత, కుటుంబ, వృత్తిపరమైన, సామాజిక బాధ్యతలు అనే నాలుగు ప్రధాన అంశాలు ఉంటాయని, వాటిని సక్రమంగా సమతుల్యంగా నిర్వహించిన వ్యక్తులు తాము నిర్దేశించుకున్న లక్ష్యాలను సాధించి ఉన్నత స్థాయికి చేరుతారని అన్నారు. విద్యార్థుల జీవనశైలిలో ప్రతి రోజు 3 - 4 గంటల సమయం చదువుకు కేటాయించాలని సూచించారు. వేకువనే నిద్ర లేవడం, సాయంత్రం తొందరగా నిద్ర పోవడం వల్ల ఉత్తమ ఫలితాలు వస్తాయని తెలిపారు. మనలోని బలాలను, బలహీనతలను గుర్తించి తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పాఠ్యాంశాల్లో జ్ఞానంతో పాటు సాంకేతిక, వ్యక్తిగత నైపుణ్యాలు నేర్చుకోవాలని చెప్పారు. నైపుణ్యాలు కొరవడిన మార్కులు నిష్ప్రయోజనం అని తెలిపారు. మంచి అలవాట్లు, వివేక సంపద, సంస్కారం, వినయ విధేయతలు, సత్ప్రవర్తన లాంటి సుగుణాలు మనకు ఆకర్షణీయ ఉద్యోగంతో పాటు కీర్తిని తెచ్చిపెడతాయని అన్నారు. ఈ సందర్భంగా క్యాంప్‌ కమాండెంట్ కల్నల్‌ జయంత, పరిపాలనాధికారి కల్నల్‌ కృష్ణలు కెప్టెన్: డాక్టర్: బుర్ర మధుసూదన్ రెడ్డిని జ్ఞాపికతో సన్మానించారు. ఈ శిక్షణా కార్యక్రమంలో శిక్షణా సిబ్బంది, ఎన్‌సిసి అధికారులు, 550 మంది ఎన్‌సిసి కొడెట్లు పాల్గొన్నారు.