ఉన్నత లక్ష్యాల సాధనకు క్రమశిక్షణ కలిగిన జీవనశైలి ప్రధానం
- లయన్ కెప్టెన్ డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి, రచయిత, వ్యక్తిత్వ వికాస నిపుణులు తాను నిర్దిష్టంగా ఎంచుకున్న లక్ష్యాల సాధనకు వారి క్రమశిక్షణ కలిగిన జీవనశైలి దోహదపడుతుందని ప్రముఖ వ్యక్తిత్వ వికాస నిపుణులు, కాలమిస్ట్, రచయిత, విశ్రాంత ప్రిన్సిపాల్, పూర్వ ఎన్‌సిసి కంపెనీ కమాండర్ లయన్ కెప్టెన్ డాక్టర్ బుర్ర మధుసూదన్ రెడ్డి పేర్కొన్నారు. ఈ రోజు తిమ్మపూర్ సమీప జ్యోతిష్మతి ఇంజనీరింగ్ కళాశాల ఆవరణలో జరుగుతున్న సంయుక్త వార్షిక శిక్షణా శిబిరంలో కెడెట్లను ఉద్దేశించి మాట్లాడుతూ ప్రతి వ్యక్తి జీవితంలో వ్యక్తిగత, కుటుంబ, వృత్తిపరమైన, సామాజిక బాధ్యతలు అనే నాలుగు ప్రధాన అంశాలు ఉంటాయని, వాటిని సక్రమంగా సమతుల్యంగా నిర్వహించిన వ్యక్తులు తాము...