Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన సామాజిక బాధ్యత .

    Author VENKATESH | 09 Jun 2026, 09:31 PM | Array
    బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన సామాజిక బాధ్యత   .

    (జూన్12 న ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా)

    బాలలు మన జాతీయ సంపద భవిష్యత్తు మానవవనరులు.
    బాలలు ఆర్థిక వ్యవస్థలో జాతీయ ఉత్పతిని పెంచడానికి దోహదపడేఉత్పాదక శక్తి. జాతీయాదాయ అభివృద్ధిలో బహుముఖపాత్ర పోషించే బాలలు
    భవిష్యత్ దేదాభివృద్ధికి దశ దిశను నిర్ణయించే శక్తి అనడoలో అతిశయోక్తి లేదు.బాలల హక్కులు స్వేచ్ఛను హరించే బాల కార్మిక వ్యవస్థ దురాచారాన్ని రుపుమాపడానికి 2002 నుండి ఐ'రా'స ' యూనిసెఫ్ ' ఐ'ఎల్'ఓ
    సంయుక్తంగా 12 జూన్ ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవాన్ని
    పాటిస్తారు. ఐ'రా'స రూపొందించిన సుస్థిరాభివృధ్ది లక్ష్యాల్లో బాగంగా2025 నాటికి బాల కార్మిక వ్యవస్థను అంతం చెయ్యాలని లక్ష్యంగా నిర్ణయించారు.
    2026 బాలకార్మిక నిర్మూలన థీమ్ ప్రపంచ బాల కార్మిక వ్యతరేక దినం థీమ్
    బాల కార్మిక వ్యవస్థకు రెడ్ కార్డ్ పిల్లలకు సమానమైన.ఆటపాటలు
    పెద్దలకు గౌరవప్రదమైన ఉపాధి.
    రెడ్ కార్డ్ ప్రచారం క్రీడల్లో తప్పుచేసిన వారికి రెడ్ కార్డ్ ఇచ్చి పంపించినట్లు సమాజం నుండి బాలకార్మిక వ్యవస్థను పూర్తిగా బహిష్కరించాలని నినాదాన్ని బలంగా తీసుకెళ్లడం
    పిల్లల హక్కులు ప్రతి బిడ్డకు నాణ్యమైన ఉచిత విద్యను అందించడం శ్రమకు దూరం చేసే వారు ఆడుకుని చదువుకుని వాతావరణం కల్పించడం పెద్దలకు ఉపాధి కుటుంబం పెద్ద వారికి తగిన ఉపాధి సరైన విత్తనాలు లభించేలా చూడడం పిల్లల సంపాదన కోసం పంపకుండా బడికి పంపాలి.
    బాల కార్మిక వ్యవస్థను అంతం చెయ్యాలని లక్ష్యంగా నిర్ణయించడం జరిగింది.

    బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన సామాజిక బాధ్యత   . - Additional Image

    ప్రపంచీకరణ' కార్పోటీకరణ‌ ' ప్రైవేటీకరణ సాంకేతిక ప్రగతి ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ లో చోటు చేసుకున్న పలు రకాల ప్రబుత్వ రంగములో మార్పులు ప్రభుత్వ రంగంలో పెట్టుబడులు ఉపసంహరణ బాలకార్మిక
    సమస్య ఉద్రుతికి ఆజ్యం పోశాయి.
    బాలకార్మిక వ్యవస్థ విశ్వ వ్యాప్తమైంది.
    ప్రపంచాన్ని పట్టిపీడిస్తున్న సామాజిక ఆర్థిక సమస్యలలో బాల కార్మిక వ్యవస్థ ప్రధానమైంది . శాస్త్ర సాంకేతిక రంగాలలో గణనీయమైన మార్పులు చోటు చేసుకున్న21వ శతాబ్దంలో కూడా ఈ సమస్య ఇంకా పరిష్కారానికి నోచుకోలేదు. బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకై చట్టాలున్నప్పటికీ అమలుకు నోచు కోకపోవడం వల్ల బాల కార్మికుల సంఖ్య రోజు రోజుకు పెరుగుతోంది . బాలల హక్కులను కాల రాస్తున్న ప్రభుత్వాలకు ఐక్యరాజ్యసమితి హెచ్చరికలు ఆదేశాలు జారీచేస్తూ బాలకార్మిక వ్యవస్థనిర్మూలన కొరకు "యునెస్కో"అంతర్జాతీయ సమాజం కృషి చేసినప్పటికి పూర్తి స్థాయిలో ఆశించిన ఫలితాలు రావడంలేదు. 5యేళ్ల నుండి15ఏళ్ళలోపు పిల్లలను బాల కార్మికులుగా పరిగణిస్తారు. కొన్ని దేశాల్లో17నుండి18ఏళ్ల లోపు పిల్లలను బాల కార్మికులుగా భావిస్తారు . ప్రస్తుతం ప్రపంచ వ్యాప్తంగా 21కోట్ల మంది బాల కార్మికులు ఉన్నారని ఐక్య రాజ్య సమితి అంచనా వేసింది . పిల్లలు ఎవరైనా బాల కార్మికులుగా ఉన్నారంటే వారిజీవన భద్రతకు ప్రాథమిక హక్కులకు భంగం కలిగినట్లు భావించాలి. బాల కార్మికులు పరిశ్రమలు '' తయారీ 'మైనింగ్ ' బాణాసంచా తయారీ ఫ్యాక్టరీలలో 'హోటళ్ళలో నిర్మాణరంగం సేవారంగాలలో బిక్షాటనలో ప్రైవేట్ అసంగటిత రంగములో బాల కార్మికులుఎక్కవ సంఖ్యలో అల్ప వేతనాలనకు పని చేస్తున్నారు.
    ప్రైవేట్ యాజమాన్యాల శ్రామిక దోపిడీకి తమ అమూల్యమైన బాల్యం బలౌతుంది.

    బాలకార్మిక వ్యవస్థకుకారణాలు

    ఇవి కూడా చదవండి

    పేదరికం నిరుద్యోగం నిరక్షరాస్యత
    ఆర్థికవ్యవస్థలో పేరుకుపోయిన పేదరికం' నిరుద్యోగం' నిరక్షరాస్యత చట్టాల పైపరిజ్ఞానం లేకపోవడంవల్ల బాలకార్మికులు పెరిగిపోతున్నారు.
    కనీసావసరాలు లేక దారిద్య్రరేఖ కింద జీవిస్తున్న పేదలు బడుగు బలహీన వర్గాలప్రజలకు అల్పఆదాయాలు అల్పకొనుగోలు శక్తి వల్ల అనేక కుటుంబాలు తమ పిల్లలను బడిలో కాకుండా పనుల్లో చేర్చుతున్నారని పలు అధ్యయనాలు తెలుపు తున్నాయి.
    ప్రపంచంలో పావు శాతం జనాభా కఠిన దారిద్ర్యాన్ని అనుభవిస్తున్నారు. ఆఫ్రికా '' 'లాటిన్ 'అమెరికా లో పేదరికం కారణంగా పిల్లలు కార్మికులుగా మారాల్సిన దుస్థితి నెలకొన్నది. కొన్ని దేశాలలో
    పిల్లలు విద్యను అభ్యసించేందుకు సౌకర్యాలులేవు . రాజ్యాంగంలో పేర్కొన్న "ఉచితవిద్య"అందని ద్రాక్ష ఐయింది .ప్రభుత్వం విద్యారంగం నుండి తప్పుకొని ప్రైవేట్ కార్పొరేట్ విద్యా సంస్థలను ప్రోత్సహించడం వల్ల పేదవర్గాలకు"విద్యమిద్యే" గామారింది. కార్పొరేట్ విద్యా ఖరీదు కావడంవల్ల పేదవర్గాల బాలలు చదువుకు దూరమై కార్మికులుగా పనిచేస్తున్నారు.
    దేశంలో నెలకొన్న సామాజిక'ఆర్థిక రాజకీయ'సామాజిక' సాంస్కృతిక పరిస్థితులు ప్రభుత్వాలు అవలంబిస్తున్న అశాస్త్రీయ సమగ్ర విద్యా పాలన విధానాలు నిర్లక్ష్యం ఉదాసీనత 'బాలల విద్యకు ఆటంకంగా పరిణమించాయి. ఇంకా కొంత మంది పిల్లలు వంశ పారంపర్యంగా వస్తున్న పనుల్లో(కులవృతుల్లో) వృత్తుల్లో పని చేస్తున్నారు. *కరొనాప్రభవం*కరొనా ప్రభావం‌ కారణంగా చాలా మంది బాల కార్మికులు జీతంలేని పనులు చేస్తున్నారు అని "ఐ ఎల్ ఓ" తెలిపింది.కరోనా వల్ల ప్రత్యక్షంగా పరోక్షంగ పేదకుటుంభాల బాలల మీద ప్రభావం పడింది. కోవిడ్ 19 వల్ల ఆర్థిక వ్యవస్థ కుదేలు కావడం వల్ల బాల కార్మిక వ్యవస్థ పైగత 20 సంవత్సరాలలో సాధించిన పురోగతి వెనుకకు నెట్టి వేయబదిందని పేదరికములోకి జారుకున్న వారి సంఖ్య 4 కోట్ల నుండి 6 కోట్లకు పెరిగింది .ఒక్క శాతం పేదరికం పెరిగితే 0.7 శాతం బాల కార్మికులు పెరుగుతారని యూనిసెఫ్ అధ్యయనంలో తేలింది ". ఐ ఎల్ ఓ‌ "అంచనాలప్రకారం ప్రపంచ వ్యాప్తంగా 15.2 కోట్ల మంది బాలకార్మికులు ఉండగా అందులో 7.2 కోట్ల పిల్లలు ప్రమాదకరమైన పనుల్లో పనిచేస్తున్నారు .బాలకార్మిక వ్యవస్థపై ఉన్న నిషేధాన్ని ఎత్తి వేయాలనే వాదన బలపడుతుంది. ఫలితంగా ప్రపంచ దేశాలు బాలకార్మిక వ్యతిరేక చట్టాలను నీరుగార్చే ప్రమాదం పొంచివుందనే హెచ్చరికలు చోటుచేసుకోవడం శోచనీయం.
    ఈసమయములో మనం సరైన నిర్ణయం తీసుకోకపోతే ఓతరాన్ని కోల్పోయే ప్రమాదం వుంది. 2000 నుండి 2016 మధ్య ప్రపంచ వ్యాప్తంగా బాలకార్మికుల సంఖ్య38 శాతం తగ్గింది.
    బాలకార్మికులు జీవితాలు సమస్యల వలయంగా మారాయి. అనేక ఇబ్బందులు పడుతున్నారు కనీసం ప్రాథమిక విద్యకు నోచుకోవడం లేదు.పోషకాహార లోపం వల్లశారీరక ఎదుగుదల సరిగా ఉండడంలేదు.అనేక మానసిక ఆరోగ్య సమస్యలను ఎదురుకొంటున్నారు.
    యాజమాన్యాలు బాలకార్మికులతో ఎక్కువగా పని చేయిస్తున్నాయి . బాలకార్మికులు తక్కువ వేతనాలుఎక్కువపని గంటలతో అనారోగ్య పరిస్థితుల్లో పనిచేస్తూ శ్రమదోపిడీకి గురవుతున్నారు. సామర్థ్యానికిమించి పనులు చేయిస్తున్నారు. ప్రమాదకర పరిస్థితుల్లో సైతం పనిచేస్తూ. బాలకార్మికులు భౌతిక 'లైంగిక దాడులను ఎదుర్కోవాల్సి వస్తుందని అనేక నివేదికలు వెల్లడిస్తున్నాయి.

    భవిష్యత్తు అంధకారం బాల కార్మికులుఅద్భుత మైన జీవితం గడిపేందుకు అవకాశాలు తక్కువ ఉన్నాయి. వీరికి సరైన విద్య 'వైద్యం అందుబాటులో లేకపోవడం వల్ల ఉపాధి అవకాశాలు తగ్గిపోతున్నాయి .పోటీతత్వము రాజ్యమేలుతున్న సమాజంలో బాలలు అన్నిరకాలుగా వెనకబడి పడిపోతున్నారు .తగిన విద్యార్హతలు 'నైపున్య్యాలులేక పోవడం వల్ల పెద్దవారైనాక సరైన ఉపాధి దొరకనిస్థితి నెలకొన్నది .
    పలువురు బాలకార్మికులు ఎక్కువ పనిగంటలు తక్కువ వేతనాలు పొందుతూ శ్రమ దోపిడీకి గురి అవుతున్నారు.అక్రమ రవాణా 'వేశ్యావృతి 'డ్రగ్ మాఫియాకు బలవుతున్నారు. నేరాలకు పాలుపడే వైఖరి(నేర ప్రవృత్తి )పెరిగి హింసాత్మక ఘటనలకు పాలుపడే ప్రమాదం వుంది. ఫలితంగా వారి బంగారు భవిష్యత్తు అంథకారంగ మారుతుందని పలుసర్వేలు వెల్లడిస్తున్నాయి . ఉపాధిఉద్యోగ
    మార్గాలు వెతుక్కునేందుకు సరైన
    మార్గదర్శనం లేకపోవడం ఆర్థిక తోడుపాటు లేకపోవడం నైపుణ్య లేమి వంటి కారణాల వల్ల బాలలు కార్మికులుగా మారుతున్నారు.ఇందుకు ప్రభుత్వం చట్టాలు సమాజం సంక్షేమ పథకాల అమలులో సమన్వయము లోపించడంగొప్ప లోపం .

    బాలకార్మిక వ్యవస్థనిర్మూలన‌.కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు బహుముఖ చర్యలు చేపట్టాలి.దేశంసంపదైన బాలలు
    బాల కార్మికవ్యవస్థలో మగ్గిపోతే దేశ భవిష్యత్తు అందకరమౌతుంది.బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకు కార్మిక.చట్టాలను కఠినంగ‌ అమలు చేసిసమూలంగా నిర్మూలించాలి .
    ఉచిత నిర్బంధ విద్య అందించాలి
    బాలలకు తగిన విద్య శిక్షణ అందించి విలువైన నిపుణతగల మానవ వనరులుగా తీర్చిదిద్దాలి.ఉపాధి హామీ పథకం 'సాంకేతిక నైపుణ్య అభివృద్ధి 'సహకార సంఘాలు సాంఘిక భద్రత పథకాల అమలు చెయ్యాలి .ఇటీవల భారతదేశ ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ప్రభుత్వం కరోనా వల్ల తల్లితండ్రులనుకోల్పోయిన బాలలకు ప్రత్యేక పథకం ప్రవేశపెట్టడం హర్షణీయం . బాల కార్మిక వ్యవస్థ నిర్మూలనకొరకు ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలు సామాజిక సంస్థలు సమిష్టిగా కలిసి ఉద్యమించాలి . బాలకార్మిక వ్యవస్థనిర్మూలనకొరకుప్రవేశపెట్టిన చట్టాలు అమలు చేయాలి. బాలలతోపని చేయించుకునే యజమానులకు కఠిన శిక్ష విధించాలి .బాలలందరికి విద్య అందించేందుకు కృషి చేయాలి. బాలకార్మిక వ్యవస్థ కారణమైన సామాజిక ఆర్థిక సాంఘిక వ్యవస్థలో గుణాత్మక మార్పు తీసుకొనిరావడం ద్వారా మాత్రమే బాలకార్మికవ్యవస్థ నిర్మూలన సాధ్యమవుతుంది పిల్లలను బడిలోచేర్పించి నంత మాత్రాన ఈసమస్య పరిష్కారంకాదు. వారి తల్లిదండ్రులు ఆర్థికంగా ఎదగడానికి అవకాశాలు కల్పించాలి. తల్లితండ్రులకు "కౌన్సెలింగ్ కేంద్రాలను" ప్రారంభించాలి
    కమ్యూనిటీ కౌన్సిలింగ్ "వ్యవస్థను సమర్థవంతంగా అమలు చెయ్యాలి.బాలకార్మికులు కొరకు ప్రతేక పాఠశాలలు నెలకొల్పాలి .
    బాలకు పౌష్ఠిక ఆహారం అందించాలి . పాఠశాల విద్య ఉచిత బోజన వసతి ఏర్పాటు చెయ్యాలి .తల్లితండ్రుల సంరక్షణ లేని అనాధబాలల కొరకు ప్రత్యేక రక్షణ సంరక్షణ సౌకర్యాలు‌ వసతి కలిపించాలి.
    ప్రపంచ దేశాలలో ఉన్న బాల కార్మికుల సంఖ్యలో మనభారత దేశం ముందు వరుసలో ఉంది. మన దేశంలో దాదాపు కోటి వరకు బాల కార్మికులు ఉన్నట్లుఅంచనా. ఈ వ్యవస్థ నిర్మూలనకు ప్రభుత్వం స్వచ్ఛంద సంస్థలు ప్రయత్నిస్తున్నాయి
    కఠినచట్టాలు అమలు చేస్తున్నాయి .అయినప్పటికీ బాలకార్మిక వ్యవస్థ ను నిర్మూలించేలేక పోతున్నాము. ప్రభుత్వం జాతీయ‌ బాలకార్మిక ప్రాజెక్టును అమలుచేస్తుంది‌
    ఇందులో‌ భాగంగా పనుల్లో మగ్గుతున్న బాలలను గుర్తించి వారికి అవాసం కలిపించి విద్యను
    అందిస్తున్నారు .ప్రస్తుతం అమలు చేస్తున్న విద్యాహక్కు చట్టం సత్ఫలితాలు ఇస్తుంది.బాలలు బైట వుండరాదు ప్రతిఒక్కరికీనిర్బంధ ప్రాథమిక విద్యనుఅందించాలని ఈ చట్టం నిర్దేశిస్తుంది .బాలకార్మిక నిషేధచట్టంప్రకారం14యేళ్లలోపు పిల్లలను పనుల్లో పెట్టుకోకూడదు . దీనిని అతిక్రమించిన వారిమీద చట్టబద్ధ చర్ర్యలు తీసుకుంటారు .జైలుశిక్ష తో పాటు జరిమానావిధిస్తారు
    యునెస్కో కృషి
    అంతర్జాతీయ బాలల హక్కుల కోసం కృషి చేస్తున్న యునెస్కో వివిధ దేశాలలో బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు చట్టాలు రూపొందించి 15 యేళ్ల లోపు పిల్లలనుఎక్కడ పనుల్లో చేర్చకోరాదని 18 యేళ్ల లోపువారినికటినమైనపనులకు ఉపయోగించరాదు అని నిబంధనలు సభ్య దేశాలప్రభుత్వాలుఅమలు చెయ్యాలని ఆదేశించడం గమనార్హం.బాలకార్మికవ్యవస్థకు సంబంధించి ఏఒక్క నిబంధననునీరు కార్చ కూడదని" ఐ ఎల్ ఓ"కుచెందిన "బెంజ్ మెన్‌ స్మిత్" అంటాడు.
    బాలకార్మిక వ్యవస్థ నిర్మూలనకు చట్టాల రూపకల్పన ప్రాథమిక విద్యను అందించడంలో యునెస్కో క్రియాశీలక పాత్ర పోషిస్తుంది.

    2025నాటికిబాలకార్మిక.వ్యవస్థను పూర్తిగా నిర్మూలించాలని సుస్తిరాబివృద్ది లక్ష్యాలల్లో నిర్దేశించారు ఈదిశగా ప్రపంచదేశాలు కృషిచెయ్యాలని బాలలహక్కుల రక్షణ పర్యవేక్షణకు పనిచేస్తున్న పలు సంస్థలు ప్రభుత్వాలకు సూచించడం గమనార్హం బాలలను హింస 'దోపిడీ దుర్వినియోగం నుండి రక్షించాలి
    బాలలసంక్షేమమే లక్ష్యంగా బాలల బంగారు భవిష్యత్తు కు దీర్ఘకాలిక అభివృధి వ్యూహంతో బాల కార్మిక రహిత భారత్ నిర్మాణానికి పాటు పడటం‌ ప్రభుత్వం కృషి చెయ్యాలి బాలల బంగారు భవిష్యత్తకుతగిన వాతావరణాన్ని సృష్టించడం సామాజంయొక్కగురుతర
    బాధ్యత . బాలల్ని శారీరక మానసిక సాంఘిక మానవీయ కోణంలో ఎదిగేలా పటిష్ట చర్యలు చేపట్టాలి. నేటి బాలలు రేపటి పౌరులు అన్నది నినాదం కాకుండా ప్రభుత్వాల విధానం కావాలి.
    బాల కార్మిక రహిత సమాజ స్థాపనకు ప్రభుత్వాలు సమగ్ర కార్యాచరణ ప్రణాళిక లను అమలు చెయ్యాలి.

    చట్టాలను కటినంగా అమలుచేయాలి
    బాలల చట్టం 1986 (2016 సవరణ )చట్టం ప్రకారం చర్యలు తీసుకోవాలి . పిల్లలను పనిలో పెట్టుకున్న యజమానులపై బారి జరిమానాలు జైలు శిక్ష వంటి చర్యలు తీసుకోవాలి.
    శాఖలమధ్య సమన్వయం మరియు దాడులు
    పోలీస్ లేబర్ చైల్డ్ ప్రొటెక్షన్ శాఖలు సంయుక్తంగా ఆపరేషన్ ముస్కాన్ వంటి ప్రత్యేక డ్రైవుల ద్వారా బాల కార్మికులను గుర్తించి రక్షించాలి. పునరవాస కేంద్రాలు ఏర్పాటు చేయాలి. ప్రత్యేక పాఠశాలలు ,(NCLP) వృత్తి విద్యా కేంద్రాలు నెలకొల్పాలి.
    విద్యార్థి శిక్షణ మరియు మానసిక కౌన్సిలింగ్ ఇవ్వాలి.
    ప్రజా చైతన్యం బాల్యం చదువుకోవడానికి సంపాదన కాదు అనే నినాదంతో సమాజంలో ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో విస్తృతంగా అవగాహన సదస్సులు నిర్వహించాలి. బాల కార్మికులు కనిపిస్తే వెంటనే అధికారులకు సమాచారం అందించాలి . ప్రతి పౌరుడు 1098 ఉచిత చైల్డ్ లైన్ నెంబర్ కు సమాచారం ఇవ్వాలి . బాల కార్మిక నిర్మూలన అనేది కేవలం ప్రభుత్వాల బాధ్యత కాదు. అది సామాజిక బాధ్యత . అపుడు మాత్రమే సమాజంలో ప్రతి ఒక్కరికి సురక్షితమైన బాల్యం అందించగలము.

    నేదునూరి కనకయ్య
    అధ్యక్షులు
    తెలంగాణ ఎకనామిక్ ఫోరం
    సామాజిక ఆర్థిక అధ్యయన వేదిక
    9440245771 కరీంనగర్