బాల కార్మిక వ్యవస్థ నిర్మూలన సామాజిక బాధ్యత .

(జూన్12 న ప్రపంచ బాల కార్మికుల వ్యతిరేక దినోత్సవం సందర్భంగా) బాలలు మన జాతీయ సంపద భవిష్యత్తు మానవవనరులు. బాలలు ఆర్థిక వ్యవస్థలో జాతీయ ఉత్పతిని పెంచడానికి దోహదపడేఉత్పాదక శక్తి. జాతీయాదాయ అభివృద్ధిలో బహుముఖపాత్ర పోషించే బాలలు భవిష్యత్ దేదాభివృద్ధికి దశ దిశను నిర్ణయించే శక్తి అనడoలో అతిశయోక్తి లేదు.బాలల హక్కులు స్వేచ్ఛను హరించే బాల కార్మిక వ్యవస్థ దురాచారాన్ని రుపుమాపడానికి 2002 నుండి ఐ'రా'స ' యూనిసెఫ్ ' ఐ'ఎల్'ఓ సంయుక్తంగా 12 జూన్ ప్రపంచ బాల కార్మిక వ్యవస్థ వ్యతిరేక దినోత్సవాన్ని పాటిస్తారు. ఐ'రా'స రూపొందించిన సుస్థిరాభివృధ్ది లక్ష్యాల్లో బాగంగా2025 నాటికి బాల కార్మిక వ్యవస్థను అంతం చెయ్యాలని లక్ష్యంగా నిర్ణయించారు. 2026...