Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాం

    Author VENKATESH | 09 Jun 2026, 12:51 PM | ఆంధ్రప్రదేశ్
    విశాఖ స్టీల్‌ప్లాంట్‌లో ప్రమాదంపై సీఎం చంద్రబాబు దిగ్భ్రాం

    అమరావతి : విశాఖ స్టీల్‌ ప్లాంట్‌ ( Visakha Steel Plant) లో జరిగిన ఘోర ప్రమాద ( Massive explosion ) ఘటనపై పలురువు దిగ్భ్రాంతిని వ్యక్తం చేశారు. ఏపీ సీఎం చంద్రబాబు ( Chandra Babu ) తో పాటు హోం మంత్రి అనిత ( Anitha ) , మంత్రి నారా లోకేష్‌ , ప్రమాద ఘటనపై విశాఖ కలెక్టర్‌ ఎస్పీతో చంద్రబాబు మాట్లాడారు. ఉద్యోగులు, కార్మికులు చనిపోవడంతో తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు. అన్ని శాఖల సమన్వయంతో సహాయ చర్యలు చేపట్టాలని సంబంధిత శాఖల అధికారులను ఆదేశిం చారు. బాధిత కుటుంబాలకు ప్రభుత్వం అండగా ఉంటుందని హోం మంత్రి హామీ ఇచ్చారు.

    విశాఖ ఉక్కు కర్మాగారం ప్లాంట్లో ఎంసీఎంఎస్‌-2, ఎస్‌టీసీ-3లో హీట్‌ ఎఫ్‌జీలో 1500 డిగ్రీల వేడి కలిగిన మెటల్‌ లిక్విడ్‌ లాడిల్‌ పేలడంతో భారీగా ప్రాణ నష్టం జరిగింది. ఉక్కు ద్రవాన్ని లిఫ్ట్‌ చేస్తుండగా ఒక్కసారిగా పేలుడు సంభవించడంతో ఐదుగురు ఉద్యోగుల ముగ్గురు ఒప్పంద కార్మికులు మృతి చెందారు.
    మృతి చెందిన వారిలో అప్పారావు, ప్రభాకర్‌రావు, కృష్ణ, రమణ, త్రినాథ్‌, అప్పలరాజు, కుమార్‌ , మరో వ్యక్తి ఉన్నట్లు ప్లాంట్‌ యాజమాన్యం వెల్లడించింది. ప్రమాదంలో మరో ఆరుగురికి గాయాలు కాగా ఇద్దరి పరిస్థితి విషమం ఉందని తెలిపారు. గాయపడ్డ కార్మికులను, ఉద్యోగులను హుటాహుటినా విశాఖ స్టీల్‌ ప్లాంట్‌లో ఉన్న ఆసుపత్రికి తరలించి వైద్యం అందిస్తున్నారు.