Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • హీరోయిన్ల‌ను కాదు, వ్యవస్థను నిందించండి

    Author VENKATESH | 07 Jun 2026, 10:42 AM | Cinema
    హీరోయిన్ల‌ను కాదు, వ్యవస్థను నిందించండి

    ఇటీవల విడుదలైన రామ్ చ‌ర‌ణ్ ‘పెద్ది’ సినిమాలో జాన్వీ పాత్రపై, అలాగే ఆ చిత్ర బృందంపై సోషల్ మీడియాలో భారీగా ట్రోల్స్ వస్తున్న సంగతి తెలిసిందే. జాన్వీ పాత్రను కేవలం గ్లామర్ కోసమే పరిమితం చేశారంటూ వస్తున్న విమర్శలపై తాజాగా నటి డింపుల్ హయాతి స్పందించారు.

    డింపుల్ మాట్లాడుతూ.. ఈ రోజుల్లో నటీమణుల పాత్రలను రాస్తున్న విధానంపై, వారికి ఇచ్చిన పాత్రలను చేసినందుకు వారిని మాత్రమే తప్పుబట్టే ధోరణిపై చర్చ జరగడం సంతోషకరమని ఆమె పేర్కొన్నారు. ఇక్కడ నటీమణులను కాకుండా, ‘ఇలాంటివే అమ్ముడుపోతాయి’ అని భావించే మేకర్స్‌(నిర్మాత‌లు, ద‌ర్శ‌కులు)ను మరియు ఈ సినిమా వ్యవస్థను నిందించాలని డింపుల్ అభిప్రాయపడ్డారు. మాలాంటి నటీనటులకు లభించే అవకాశాల పరిధిలోనే పని చేస్తూ, పెద్ద సినిమాల్లో నటిస్తూ మరింత మంది ప్రేక్షకులకు చేరువవ్వాలని ఆశపడుతుంటామని వివరించారు. ఒక పాత్ర సరిగ్గా రాయబడకపోతే ఆ బాధ్యత ఆ పాత్రను పోషించిన మహిళది కాదని, అది పూర్తిగా రైటింగ్ మరియు మేకింగ్ ఛాయిస్‌లదే అవుతుందని స్పష్టం చేశారు. దురదృష్టవశాత్తూ తాము చేసే పాత్రల ఆధారంగా ఒక ఇమేజ్ ముద్ర పడిపోతుందని, దీనివల్ల పూర్తి నటనా సామర్థ్యాన్ని నిరూపించుకునే అవకాశం దక్కడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. అదే సమయంలో హీరో ప్ర‌ధాన పాత్ర‌ కథల విషయానికి వస్తే వారికి కావాల్సినంత స్వేచ్ఛ, ప్రాధాన్యత లభిస్తాయని, స్క్రీన్‌పై ఏం చూస్తామో దాన్నే ప్రేక్షకులు నమ్ముతారని చెప్పారు. సినిమా నిర్మాణంలో ఉండే పరిస్థితులు ఒక్కరి నిర్ణయంపై మాత్రమే ఆధారపడి ఉండవని, అయితే తామంతా మరింత మెరుగైన అనుభవాలకు, మెరుగైన సినిమా నిర్మాణానికి అర్హులమనే విషయాన్ని అందరూ ఏకగ్రీవంగా అంగీకరించాలని డింపుల్ హయాతి పిలుపునిచ్చారు.