హీరోయిన్ల‌ను కాదు, వ్యవస్థను నిందించండి

ఇటీవల విడుదలైన రామ్ చ‌ర‌ణ్ ‘పెద్ది’ సినిమాలో జాన్వీ పాత్రపై, అలాగే ఆ చిత్ర బృందంపై సోషల్ మీడియాలో భారీగా ట్రోల్స్ వస్తున్న సంగతి తెలిసిందే. జాన్వీ పాత్రను కేవలం గ్లామర్ కోసమే పరిమితం చేశారంటూ వస్తున్న విమర్శలపై తాజాగా నటి డింపుల్ హయాతి స్పందించారు. డింపుల్ మాట్లాడుతూ.. ఈ రోజుల్లో నటీమణుల పాత్రలను రాస్తున్న విధానంపై, వారికి ఇచ్చిన పాత్రలను చేసినందుకు వారిని మాత్రమే తప్పుబట్టే ధోరణిపై చర్చ జరగడం సంతోషకరమని ఆమె పేర్కొన్నారు. ఇక్కడ నటీమణులను కాకుండా, ‘ఇలాంటివే అమ్ముడుపోతాయి’ అని భావించే మేకర్స్‌(నిర్మాత‌లు, ద‌ర్శ‌కులు)ను మరియు ఈ సినిమా వ్యవస్థను నిందించాలని డింపుల్ అభిప్రాయపడ్డారు. మాలాంటి నటీనటులకు లభించే అవకాశాల పరిధిలోనే...