Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • చిత్రియాలలో ఘనంగా దుర్గామాత దర్శనం.. మహా అన్నప్రసాద వితరణ

    Author VENKATESH | 19 Oct 2026, 08:47 PM | నల్గొండ
    చిత్రియాలలో ఘనంగా దుర్గామాత దర్శనం.. మహా అన్నప్రసాద వితరణ

    పాల్గొన్న PACS చైర్మన్ జాలే నరసింహారెడ్డి
    ​దేవరకొండ,19అక్టోబర్ (BVK 3 న్యూస్ ) :
    చందంపేట మండలంలోని చిత్రియాల గ్రామంలో కొలువుదీరిన శ్రీ శ్రీ శ్రీ దుర్గామాత అమ్మవారిని సోమవారం చందంపేట మండల మాజీ వైస్ ఎంపీపీ శ్రీమతి జాలే ప్రేమలత రెడ్డి, కుటుంబ సభ్యులతో కలిసి దర్శించుకున్నారు. ఈ సందర్భంగా అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి మొక్కులు చెల్లించుకున్నారు.
    ​అనంతరం జాలే బ్రదర్స్ (నరసింహారెడ్డి, తిలక్ రెడ్డి) ఆర్థిక సహాయంతో నిర్వహించిన మహా అన్నప్రసాద కార్యక్రమంలో మన ప్రియతమ నాయకులు, PACS చైర్మన్ గౌరవ శ్రీ జాలే నరసింహారెడ్డి గారు స్వయంగా పాల్గొని భక్తులకు అన్నప్రసాదం వడ్డించారు.
    ​ఈ సందర్భంగా నరసింహారెడ్డి మాట్లాడుతూ.. ఆ దుర్గామాత అమ్మవారి ఆశీస్సులతో దేవరకొండ నియోజకవర్గ ప్రాంత ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో, సిరిసంపదలతో వర్ధిల్లాలని ఆకాంక్షించారు. అలాగే గ్రామ ప్రజలందరికీ విజయదశమి (దసరా) శుభాకాంక్షలు తెలిపారు.
    ​అనంతరం ఆలయ కమిటీ సభ్యులు జాలే నరసింహారెడ్డిని ఘనంగా శాలువాతో సత్కరించి, తీర్థప్రసాదాలు అందజేసి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.
    ​ఈ కార్యక్రమంలో మాజీ ఉప సర్పంచ్ యాదయ్య, చాట్ల వెంకటయ్య, వార్డు సభ్యులు మహేష్, ఆంజనేయులు, నిరంజన్, దుల్లా వెంకట్, మంజునాథ్ తదితరులు మరియు గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొన్నారు.