Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా తీదేడు రామాలయం వద్ద భక్తిశ్రద్ధలతో మహా అన్నప్రసాద వితరణ

    Author VENKATESH | 19 Oct 2026, 08:34 PM | నల్గొండ
    దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా తీదేడు రామాలయం వద్ద భక్తిశ్రద్ధలతో మహా అన్నప్రసాద వితరణ

    ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి
    తీదేడు గ్రామ సర్పంచ్
    దేవరకొండ,19అక్టోబర్ (BVK 3 న్యూస్ ) :
    చింతపల్లి మండలం తీదేడు రామాలయం వద్ద కొలువుదీరిన దుర్గా మాత శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భక్తిశ్రద్ధలతో మహా అన్నప్రసాదం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు.
    ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. దుర్గా మాత ఆశీస్సులతో గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. అన్నదానం మహాదానమని, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం అత్యంత పవిత్రమైన సేవ అని పేర్కొన్నారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు గ్రామంలో భక్తిభావాన్ని, ఐక్యతను, సోదరభావాన్ని పెంపొందిస్తాయని తెలిపారు.
    అమ్మవారి కృపతో తీదేడు గ్రామం సుభిక్షంగా ఉండాలని, ప్రజలందరికీ శాంతి, సౌభాగ్యాలు కలగాలని దుర్గా మాతను ప్రార్థించారు. శరన్నవరాత్రి ఉత్సవాలను భక్తిశ్రద్ధలతో నిర్వహించేందుకు సహకరిస్తున్న భక్తులకు, గ్రామ ప్రజలకు సర్పంచ్ కృతజ్ఞతలు తెలిపారు.