దేవి శరన్నవరాత్రి ఉత్సవాల సందర్భంగా తీదేడు రామాలయం వద్ద భక్తిశ్రద్ధలతో మహా అన్నప్రసాద వితరణ

ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి తీదేడు గ్రామ సర్పంచ్ దేవరకొండ,19అక్టోబర్ (BVK 3 న్యూస్ ) : చింతపల్లి మండలం తీదేడు రామాలయం వద్ద కొలువుదీరిన దుర్గా మాత శరన్నవరాత్రి ఉత్సవాల్లో భాగంగా భక్తిశ్రద్ధలతో మహా అన్నప్రసాదం కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా భక్తులు, గ్రామ ప్రజలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారి ఆశీస్సులు పొందారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి మాట్లాడుతూ.. దుర్గా మాత ఆశీస్సులతో గ్రామ ప్రజలందరూ సుఖసంతోషాలతో, ఆయురారోగ్యాలతో ఉండాలని ఆకాంక్షించారు. అన్నదానం మహాదానమని, ఆకలితో ఉన్నవారికి అన్నం పెట్టడం అత్యంత పవిత్రమైన సేవ అని పేర్కొన్నారు. ఇలాంటి ఆధ్యాత్మిక కార్యక్రమాలు గ్రామంలో భక్తిభావాన్ని, ఐక్యతను,...