Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • దసరా పండుగ కానుక: తీదేడులో మల్టీ పర్పస్ వర్కర్లకు నూతన వస్త్రాలు అందజేత

    Author VENKATESH | 19 Oct 2026, 08:25 PM | నల్గొండ
    దసరా పండుగ కానుక: తీదేడులో మల్టీ పర్పస్ వర్కర్లకు నూతన వస్త్రాలు అందజేత

    ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి
    తీదేడు గ్రామ సర్పంచ్
    దేవరకొండ,19అక్టోబర్ (BVK 3 న్యూస్ ) :
    విజయదశమి దసరా పండుగను పురస్కరించుకుని తీదేడు గ్రామ పంచాయతీ మల్టీ పర్పస్ వర్కర్లకు గ్రామ సర్పంచ్ ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి నూతన వస్త్రాలను అందజేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...గ్రామ పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణ, ప్రజలకు అవసరమైన సేవలను అందించడంలో మల్టీ పర్పస్ వర్కర్లు గ్రామ పంచాయతీకి వెన్నెముక లాంటి వారని పేర్కొన్నారు.ఎండ, వాన అనే తేడా లేకుండా గ్రామ ప్రజల ఆరోగ్యం, పరిసరాల పరిశుభ్రత కోసం నిరంతరం శ్రమించే సిబ్బంది సేవలు ఎంతో విలువైనవని కొనియాడారు.దసరా పండుగ అనేది చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక మాత్రమే కాకుండా, ప్రతి ఒక్కరూ సంతోషాన్ని, ఆత్మీయతను,ప్రేమాభిమానాలను పంచుకునే పండుగ అని ఆమె అన్నారు. గ్రామ అభివృద్ధి కోసం నిత్యం కష్టపడే సిబ్బంది కూడా తమ కుటుంబాలతో కలిసి పండుగను ఆనందంగా జరుపుకోవాలనే సదుద్దేశంతో, వారి సేవలను గుర్తించి గౌరవించాలనే సంకల్పంతో నూతన వస్త్రాలను అందజేసినట్లు తెలిపారు.గ్రామ అభివృద్ధి అంటే కేవలం రహదారులు, భవనాలు నిర్మించడం మాత్రమే కాదు. గ్రామం పరిశుభ్రంగా ఉండటం, ప్రజలకు మెరుగైన సేవలు అందడం, ఆ సేవల వెనుక నిరంతరం శ్రమించే ప్రతి కార్మికుడికి తగిన గౌరవం లభించడం కూడా నిజమైన అభివృద్ధిలో భాగమే. గ్రామ పంచాయతీ సిబ్బంది కష్టాన్ని గుర్తించడం, వారిని ఆత్మీయంగా ప్రోత్సహించడం మనందరి బాధ్యత. వారు గ్రామానికి అందిస్తున్న సేవలకు గుర్తింపుగా ఈ చిన్న కానుకను అందించడం నాకు ఎంతో సంతోషంగా ఉందని ఆమె అన్నారు.గ్రామ ప్రజల సంక్షేమం కోసం పనిచేసే ప్రతి ఒక్కరికీ అండగా ఉంటూ, అందరి సహకారంతో మన గ్రామాన్ని పరిశుభ్రంగా, ఆదర్శవంతంగా తీర్చిదిద్దేందుకు కృషి చేస్తామని తెలిపారు.పండుగలు కేవలం వ్యక్తిగత ఆనందానికే పరిమితం కాకుండా, సమాజంలోని ప్రతి ఒక్కరినీ కలుపుకొని వెళ్లేలా ఉండాలని, కష్టపడి పనిచేసే కార్మికులను గౌరవించడం ద్వారా సమానత్వం, మానవత్వం, సామాజిక బాధ్యత వంటి విలువలు మరింత బలపడతాయని ఆమె పేర్కొన్నారు.ఈ కార్యక్రమంలో గ్రామ పాలక వర్గం సభ్యులు బొడ్డు పార్వతమ్మ యాదగిరి, మాదగోని కృష్ణ గౌడ్,రెడ్డి పద్మ పరమేష్,మర్ల యాదగిరి యాదవ్, గ్రామస్తులు మర్రు రామారావు,సిమర్ల శ్రీను యాదవ్,వీరమల్ల వెంకటయ్య,గ్రామ పంచాయతీ మల్టీ పర్పస్ వర్కర్లు సందె ఎల్లయ్య,ఐతమోని భరత్, వంకేశ్వరం శ్రీకాంత్,రాశిక మల్లయ్య,కొన్రెడ్డి రామలింగం, తదితరులు పాల్గొన్నారు.