దసరా పండుగ కానుక: తీదేడులో మల్టీ పర్పస్ వర్కర్లకు నూతన వస్త్రాలు అందజేత
ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి తీదేడు గ్రామ సర్పంచ్ దేవరకొండ,19అక్టోబర్ (BVK 3 న్యూస్ ) : విజయదశమి దసరా పండుగను పురస్కరించుకుని తీదేడు గ్రామ పంచాయతీ మల్టీ పర్పస్ వర్కర్లకు గ్రామ సర్పంచ్ ఉలుపాల స్వప్న శేఖర్ రెడ్డి నూతన వస్త్రాలను అందజేశారు.ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ...గ్రామ పరిశుభ్రత, పారిశుద్ధ్య నిర్వహణ, ప్రజలకు అవసరమైన సేవలను అందించడంలో మల్టీ పర్పస్ వర్కర్లు గ్రామ పంచాయతీకి వెన్నెముక లాంటి వారని పేర్కొన్నారు.ఎండ, వాన అనే తేడా లేకుండా గ్రామ ప్రజల ఆరోగ్యం, పరిసరాల పరిశుభ్రత కోసం నిరంతరం శ్రమించే సిబ్బంది సేవలు ఎంతో విలువైనవని కొనియాడారు.దసరా పండుగ అనేది చెడుపై మంచి సాధించిన విజయానికి ప్రతీక...