Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • అమెరికా భావి అధ్య‌క్షుడు మ‌నకు శ‌త్రువు కావ‌చ్చు.. భార‌త్ చిన్న దేశ‌మేమీ కాదు

    Author VENKATESH | 19 Oct 2026, 01:43 PM | INTERNATIONAL
     అమెరికా భావి అధ్య‌క్షుడు మ‌నకు శ‌త్రువు కావ‌చ్చు.. భార‌త్ చిన్న దేశ‌మేమీ కాదు

    భవిష్యత్‌ అమెరికా అధ్యక్షుడు ఇజ్రాయెల్‌ కు శుత్రువు కావ‌చ్చున‌ని ఆ దేశ ప్రధాని బెంజామిన్‌ నెతన్యాహు వ్యాఖ్యానించారు. ఈ త‌రుణంలో భారత్‌, లాటిన్‌ అమెరికావంటి బలమైన దేశాలతో పొత్తు పెట్టుకోవాలని నెత‌న్యాహు త‌న‌ అధికారులకు పిలుపునిచ్చారు. స్థానిక మీడియా కథనాలు ఈ విష‌యాన్ని వెల్లడించాయి. అక్టోబర్ 27న ఇజ్రాయెల్‌లో ఎన్నికలు జ‌రుగనున్నాయి. ఈ నేప‌థ్యంలో నెత‌న్యాహు వ్యాఖ్య‌లు ప్రాధాన్యం సంత‌రించుకున్నాయి.మీడియా క‌థ‌నాల ప్ర‌కారం.. మరో రెండేళ్లలో ఇజ్రాయెల్‌ పట్ల శత్రుభావంతో ఉండే వ్యక్తి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టవచ్చున‌ని, వారు పురుషుడు లేదా మహిళ ఎవరైనా కావచ్చున‌ని, మీరు దానిని ఎలా ఎదుర్కొంటారు..? అని అధికారులను ఉద్దేశించి నెత‌న్యాహు ప్ర‌శ్నించారు. అగ్రరాజ్యంతో సంబంధాలు ఎలా నిర్వహిస్తారని అడిగారు. అమెరికా విధానంలో సంభవించే పెద్ద మార్పుకు సిద్ధమవుతూ.. ట్రంప్ అధ్యక్షుడిగా ఉన్న రోజుల్లోనే ఇజ్రాయెల్ తన స్థానాన్ని మరింత బలోపేతం చేసుకోవాలని సూచించారు.వచ్చే రెండేళ్లలోనే అమెరికా సాయంతో చేయగలిగినదంతా చేయాలని నెత‌న్యాహు అన్నారు. అదే సమయంలో భవిష్యత్‌ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని మరిన్ని దేశాలతో సంబంధాలు పెంచుకోవాల్సిన అవసరం ఉందని చెప్పారు. కూటములను ఏర్పాటు చేసుకోవాలని, ఇప్పుడు తాను అదే పని చేస్తున్నానని అన్నారు. భారత్‌ చిన్న దేశమేమీ కాదని, అలాగే లాటిన్‌ అమెరికా, బ్రెజిల్‌లలో త్వరలో భారీ మార్పులు వచ్చే అవకాశం ఉందని చెప్పారు. కూటముల సంఖ్యను విస్తరించుకోవాలని, విలువ పెంచే సామర్థ్యాలను వృద్ధి చేసుకోవాలని పిలుపునిచ్చారు.