అమెరికా భావి అధ్యక్షుడు మనకు శత్రువు కావచ్చు.. భారత్ చిన్న దేశమేమీ కాదు
భవిష్యత్ అమెరికా అధ్యక్షుడు ఇజ్రాయెల్ కు శుత్రువు కావచ్చునని ఆ దేశ ప్రధాని బెంజామిన్ నెతన్యాహు వ్యాఖ్యానించారు. ఈ తరుణంలో భారత్, లాటిన్ అమెరికావంటి బలమైన దేశాలతో పొత్తు పెట్టుకోవాలని నెతన్యాహు తన అధికారులకు పిలుపునిచ్చారు. స్థానిక మీడియా కథనాలు ఈ విషయాన్ని వెల్లడించాయి. అక్టోబర్ 27న ఇజ్రాయెల్‌లో ఎన్నికలు జరుగనున్నాయి. ఈ నేపథ్యంలో నెతన్యాహు వ్యాఖ్యలు ప్రాధాన్యం సంతరించుకున్నాయి.మీడియా కథనాల ప్రకారం.. మరో రెండేళ్లలో ఇజ్రాయెల్ పట్ల శత్రుభావంతో ఉండే వ్యక్తి అమెరికా అధ్యక్షుడిగా బాధ్యతలు చేపట్టవచ్చునని, వారు పురుషుడు లేదా మహిళ ఎవరైనా కావచ్చునని, మీరు దానిని ఎలా ఎదుర్కొంటారు..? అని అధికారులను ఉద్దేశించి నెతన్యాహు ప్రశ్నించారు. అగ్రరాజ్యంతో సంబంధాలు ఎలా నిర్వహిస్తారని...