Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • జీవితం నా కోసం కాదు మీ కోసం

    Author VENKATESH | 13 Oct 2026, 11:31 AM | కరీంనగర్
    జీవితం నా కోసం కాదు మీ కోసం

    ఎకనామిక్ ఫోరం అధ్యక్షులు
    రచయిత కాలమిస్ట్ నేదునూరి
    కనకయ్య గారి 71వ జన్మదినం
    సందర్భంగా రాసిన కవిత)

    71 వ వసంతంలోకి అడుగు
    పెడుతున్న శుభవేళ
    నా జీవిత కాల చక్రంలో ఉత్థాన పతనాలెన్నో
    బాల్యంలో చిలిపి చేష్టలు
    యవ్వనంలో ధైర్య సాహసాలు
    అనుకున్నది చేసి అందరితో
    ఆనందాన్ని పంచుకొని
    పరవశించిన తుంటరి చేష్టలు
    ప్రత్యేకతను చాటినప్రగతి శీలత

    లక్ష్య సాధనలో ఎదురైన నిరాశ
    నిస్పృహలు అవరోధాలనే
    అవకాశాలుగా స్వీకరించి
    అందివచ్చిన ఉద్యోగ బాధ్యతలకు
    న్యాయం చేసిన ఉత్తమ సేవా
    పేదవిధార్థులకు అందించిన ఆర్థిక
    చేయూత విద్యార్థుల్లోసామాజిక
    శాస్త్రాల అధ్యయనం పట్ల మక్కువ
    కలిగేట్లు చేసిన ప్రోత్సాహక
    సరళశైలి భోధనా మెళుకువలు

    ఐ ఎ ఎస్ ఐ ఇ ఎస్ గ్రూప్ సర్వీసెస్ఉద్యోగ ఎంపికల్లో జరిగిన ఇంటర్వ్యూ ల్లో అనుభవించిన తీపిఙ్ఞాపకాలు ఎదురైన చేదు అనుభవాలు

    అధ్యాపకుల ఆజ్ఞలు ఆదేశాలు సలహాలు సూచనలు
    నా జీవితానికి దారిదీపమై నిల్చిన రోజులు క్లాస్మేట్స్ తో ఆడిన ఆటలు విజ్ఞాన విహారయాత్రలు పాడిన పాటలు ఆడిన నాటకాలు వక్తృత్వ వ్యాస కవిత రచన క్విజ్ బ్యాడ్మెంట్ పోటీల్లోపొందిన
    బహుమతులు
    పరీక్షల్లో సాధించిన ప్రతిభకు
    అధ్యాపకుల చేత అందుకున్న
    ప్రశంసలు తోటి విద్యార్థుల
    అభినందనలు

    తల్లి తండ్రుల ఆశీర్వాద ప్రోత్సాహక వాక్యలు
    జీవితంలో ఉన్నత స్థాయిలో
    ఉత్తమ వ్యక్తిగా రాణిస్తావన్న
    తల్లి తండ్రుల ప్రోత్సాహక
    ఆశీర్పూర్వక అభినందన
    మాటలు నాలో పట్టుదలను
    సంకల్పానికి పునాది వేసి
    గొప్ప మూలధనంగా నిలిచిన
    రోజులు ఙ్ఞాపకమొస్తున్నాయి

    ఏదైనా సాధించాలన్న
    తపనను నాలో ప్రజ్వలింప చేసిన
    రోజుల జ్ఞాపకాల మాల గుర్తుకు
    వచ్చిన వేళ మదిలో స్పురణకు
    తెచ్చిన సంఘటనలు

    నా 71 వసంతాల జీవితం పలు
    సమస్యల పరిష్కారానికి వేదిక
    కావడం గర్వంగా ఉంది

    కుటుంబ జీవితం సామాజిక
    జీవితం మధ్య సమతుల్యతను
    పాటిస్తూ సామాజిక చైతన్యమే
    ఊపిరిగా సాహితీ సాంస్కృతిక
    వికాసం కోసం పరిశోధనాత్మక
    రచనలతో సృజనశీలతతో
    గడిపిన జీవితం నిత్య నూతనం

    ఇవి కూడా చదవండి

    అర్థశాస్త్ర పరిజ్ఞాన పరివ్యాప్తికి
    4 దశాబ్దాలుగా తెలంగాణ
    ఎకనామిక్ ఫోరం అధ్యక్షునిగా
    200 మంది ఇంటర్ విద్యార్థులకు
    హెచ్ఇ సి 'సి'ఇ'సి (విభాగం)
    (సామాజిక శాస్త్రాల విభాగం)
    మెరిట్ విద్యార్థులకు
    స్పెషల్ గా ఎకనామిక్స్ సబ్జెక్ట్ లో
    మెరిట్ అవార్డ్స్ ఇవ్వగా వారు
    అర్థశాస్త్ర లెక్చరర్స్ గా కళాశాలల్లో
    ఉత్తమ అధ్యాపకలుగా
    రాణిస్తున్నారు

    నా సామాజిక సేవలు బోధన
    సేవలు యువతకు స్ఫూర్తి గా
    నిలిచినందుకు సంతోషంగా ఉంది
    నా పూర్వ విదార్థులు కేంద్ర రాష్ట్ర
    ప్రభుత్వాల్లో మంత్రులుగా
    ఐ 'ఎ 'ఎస్ ' ఐ'పి 'ఎస్ ఉత్తమ
    అధికారులుగా రాణిస్తున్నారు

    నాకోసం కాదు మీకోసం అనే
    నినాదాన్ని స్ఫూర్తిగా తీసుకొని
    ఎన్ ఎస్ ఎస్ జాతీయ శిబిరంలో
    మీడియా కన్వీనర్గా జాతీయ
    స్థాయిలో ఇందిరాగాంధీ అవార్డ్ పొందిన ఉత్తమ ఎన్ ఎస్ ఎస్
    యూనిట్ కు అధికారిగా
    చేసిన సేవలు చిరస్మరణీయాలు
    ఎన్ఎస్ఎస్ అధికారిగా
    యువతలో సామాజిక సేవా
    తత్పరతను పెంచిన ఎన్ఎస్ఎస్
    శిబిరాలు గుర్తుకొస్తున్నాయి

    గ్రామీణ క్రాంతి పథం విజన్ 2020 జన్మభూమి ఎయిడ్స్ నోడల్ లెక్చరర్ ఎకనామిక్స్ ఫోరం మెరిట్
    అవార్డ్స్ పలు జిల్లా రాష్ట్రజాతీయ
    స్థాయి అర్థశాస్త్ర సెమినార్లలో
    సమర్పించిన పరిశోధక పత్రాల
    సంఘటనలు

    బీసీ రాజ్యాధికార సాధన
    బీసీ మహిళా రిజర్వేషన్స్ పై రాష్ట్ర జాతీయ స్థాయి బీసీ కమిషన్ కు సమ ర్పించిన విజ్ఞప్తులు

    ఉమ్మడి ఎపి హైకోర్టు రిటైర్డ్ చీఫ్ జస్టిస్ ఎన్ కుమారయ్య పేరున స్థాపించిన జస్టిస్ కుమారయ్య
    లా కళాశాల కరీంనగర్ ఫౌండర్
    కరెస్పాండెంట్ గా న్యాయ విజ్ఞాన
    వ్యాప్తికి చేసిన ఉచిత
    న్యాయసేవలు అందరికి న్యాయం
    అందించాలన్న లక్ష్య సాధనకై
    చేసిన సేవలు చిరస్మరణీయాలు

    పలు సామాజిక స్వచ్ఛంద
    సంస్థల ఇచ్చిన అవార్డ్స్ స్వీకరించి
    ఉత్తమ అధ్యాపకుడుగా
    అర్థశాస్త్ర పాఠాలు నేర్పి
    ఉత్తమఆర్థికవేత్తగా ప్రగతిపాఠాలు దిద్ది ఉత్తమ సమాజావేత్తగా ప్రజా హితమే శ్వాసగా మార్చుకొన్న
    సామాజిక చైతన్య శీలి

    తెలంగాణ ఆణిముత్యమై
    ఈ నేలపై మెరుస్తూ రాజకీయ సామాజిక విశ్లేషణలు చేస్తూ సమాజానికి దిశ దశ నిర్దేశిస్తూ అక్షరాల ఆయుధంతో సత్యాన్ని శోధిస్తూ సమాజ చైతన్యానికి దిక్సూచిగా నిలిచి తెలంగాణ ఎకనామిక్ ఫోరం ప్రగతి రథ సారధిగా తెలంగాణ ఎడ్యుకేషన్ ఫోరం విద్యా వెలుగుల మార్గదర్శిగా తెలంగాణ వికాస వేదిక సంస్థాపక అధ్యక్షునిగా చేసిన సేవలు గడ్డపై చెరగని ముద్రలు

    అధ్యాపక లోకం విద్యార్థి
    లోకంతో చేసిన విహారయాత్రల
    మధుర జ్ఞాపకాలు సంఘటనలు మర్చిపోని మరువలేని జీవిత
    సంతోషాల సమాహారం
    గుర్తుకొస్తున్నాయి

    యోగ ధ్యానం విహార యాత్రలు ఆధ్యాత్మికత నా ఆరోగ్య ఆనందకర జీవితంలోభాగమై
    నిత్య సంతోషాల సందడికి
    దోహదపడిన రోజులు

    నా శ్రేయస్సును కోరే ఆత్మీయుల
    స్నేహితుల నవ్వులు పువ్వులై
    వికసించిన మానవీయ
    పరిమళాలసుగంధాలు
    నాలో ప్రశాంతతను తెచ్చిన
    రోజులు గుర్తుకొస్తున్నాయి

    నేదునూరి కనకయ్య
    అధ్యక్షులు తెలంగాణ
    ఎకనామిక్ ఫోరం
    తెలంగాణ ఎడ్యుకేషన్ ఫోరం
    రచయిత కాలమిస్ట్
    కరీంనగర్9440245771