Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • "ఓ యువతా" ఆలోచనా విధానాన్ని మార్చుకో అభివృద్ధిని కోరుకో

    Author VENKATESH | 10 Oct 2026, 10:08 PM | కరీంనగర్
    "ఓ యువతా" ఆలోచనా విధానాన్ని మార్చుకో   అభివృద్ధిని కోరుకో

    యువతరం అనుకుంటే
    ఏదైనా సాధిస్తారు
    ఓయువతా సాధనకు
    అనుకూలంగా
    ఆలోచనలుమార్చుకో
    నెగెటివ్ ఆలోచనలు వద్దు
    పాజిటివ్ ఆలోచనలే ముద్దు
    పాజిటివ్ దృక్పథమే నిన్ను
    విజేతగా మార్చుతుంది
    యువతా సోమరితనాన్ని
    వదలాలి పట్టుదలతో సాగాలి
    నీ ఆలోచనలే మార్పుకు
    భవిష్యత్తుకు దిక్సూచి
    నా వల్ల కాదు అనే మాటవద్దు
    భయాన్ని వీడాలి ధైర్యంతో
    ముందడుగు వేయాలి
    నేటి చిన్న ఆలోచన రేపటి
    గెలుపుకు పునాది అని మరవద్దు
    ఫోన్ స్క్రీన్ లో కాలాన్ని కరిగించకు విలువైన
    సమయాన్ని వృథా చేయకు
    పోలికలు వదిలి నీ ప్రతిభను పెంచుకో సృజన నీ జీవితంలో భాగం కావాలి
    కష్టాలు వస్తె కుంగిపోకు
    ఓటమి ఎదురైతే ఆగిపోకు
    ఆలోచన మార్చి అనుకున్నది సాధించు
    సంకుచితంవద్దు విశాలత్వమే ముద్దు
    నీ ఆలోచనలే నీ ఆయుధం
    నీ ఆత్మవిశ్వాసమే నీ బలం
    మారిన నీ ఆలోచనా విధానమే
    ప్రగతికి మూలం
    యువత దేశానికి వెన్నెముక
    పాత కొత్త నిరాశల నుండి
    బయటకు రండి
    నేను మారుతాను నేను విజయం
    సాధిస్తాను అనే కొత్త ఆలోచనతో ముందడుగు వేద్దాం
    ఆలోచన మార్చుకుందాం
    అభివృద్ధిని సాధిద్దాం
    మనం చేసే పని అనుకున్నట్లు జరుగక పోతే ఏమిటి పరిస్థితి?
    అని భయపడటం మానేసి
    పరిస్థిటి ఎలావున్నా దాన్ని నేను పరిష్కరించుకోగలను అనే ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకున్న క్షణం మన జీవితములో మార్పు జరుగుతుంది.
    నేదునూరి కనకయ్య అధ్యక్షులు తెలంగాణ ఎకనామిక్ ఫోరం రచయిత కాలమిస్ట్ కరీంనగర్