Advertisement Frame Slot (728x90 Billboard standard)
EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • కాన్షీరాం 20వ వర్ధంతి: హైదరాబాద్‌కు తరలివెళ్లిన దేవరకొండ బహుజన నాయకులు

    Author VENKATESH | 10 Oct 2026, 10:05 PM | నల్గొండ
    కాన్షీరాం 20వ వర్ధంతి: హైదరాబాద్‌కు తరలివెళ్లిన దేవరకొండ బహుజన నాయకులు

    బీఎస్పీ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షులు కామేపల్లి సైదులు
    ​దేవరకొండ,10అక్టోబర్ (BVK 3 న్యూస్ ) :
    బహుజన సమాజ్ పార్టీ (BSP) వ్యవస్థాపకులు, బహుజన ఉద్యమ పితామహులు మాన్యశ్రీ కాన్షీరాం సాహెబ్ 20వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్‌లో నిర్వహించిన ప్రతిష్టాత్మక “బహుజన రాజ్యాధికార సమరభేరి” సభలో దేవరకొండ నియోజకవర్గ బహుజన శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నాయి. ఈ కార్యక్రమం కోసం నియోజకవర్గం నుంచి వందలాది మంది బహుజన నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక వాహనాల్లో హైదరాబాద్‌కు తరలివెళ్లారు.
    ​ఈ సందర్భంగా బీఎస్పీ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షులు కామేపల్లి సైదులు మాట్లాడుతూ...బహుజనుల రాజ్యాధికారమే లక్ష్యంగా జీవితాంతం శ్రమించిన మహనీయుడు కాన్షీరాం సాహెబ్ అని కొనియాడారు. ఆయన ఆశయ సాధన కోసం ప్రతి ఒక్కరూ పునరంకితం కావాలని పిలుపునిచ్చారు.
    ​కాన్షీరాం మార్గంలో నడుస్తూ బహుజనుల ఐక్యత, ఆత్మగౌరవం, సామాజిక న్యాయం కోసం నిరంతరం పోరాడుతామని సైదులు స్పష్టం చేశారు. రాబోయే రోజుల్లో దేవరకొండ గడ్డపై బహుజన్ సమాజ్ పార్టీ నీలి జెండాను సగర్వంగా ఎగురవేసి, కాన్షీరాం ఆశయాలను ఆచరణలో చూపుతామని ధీమా వ్యక్తం చేశారు.
    ​రాజ్యాధికార సాధనే ధ్యేయంగా దేవరకొండ నియోజకవర్గ ప్రజానీకమంతా ఐక్యమత్యంతో ముందుకు రావాలని ఆయన విజ్ఞప్తి చేశారు. ఈ కార్యక్రమంలో పలువురు స్థానిక నాయకులు, కార్యకర్తలు ఉత్సాహంగా పాల్గొన్నారు.