కాన్షీరాం 20వ వర్ధంతి: హైదరాబాద్కు తరలివెళ్లిన దేవరకొండ బహుజన నాయకులు
బీఎస్పీ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షులు కామేపల్లి సైదులు దేవరకొండ,10అక్టోబర్ (BVK 3 న్యూస్ ) : బహుజన సమాజ్ పార్టీ (BSP) వ్యవస్థాపకులు, బహుజన ఉద్యమ పితామహులు మాన్యశ్రీ కాన్షీరాం సాహెబ్ 20వ వర్ధంతి సందర్భంగా హైదరాబాద్లో నిర్వహించిన ప్రతిష్టాత్మక “బహుజన రాజ్యాధికార సమరభేరి” సభలో దేవరకొండ నియోజకవర్గ బహుజన శ్రేణులు పెద్ద ఎత్తున పాల్గొన్నాయి. ఈ కార్యక్రమం కోసం నియోజకవర్గం నుంచి వందలాది మంది బహుజన నాయకులు, కార్యకర్తలు ప్రత్యేక వాహనాల్లో హైదరాబాద్కు తరలివెళ్లారు. ఈ సందర్భంగా బీఎస్పీ దేవరకొండ నియోజకవర్గ అధ్యక్షులు కామేపల్లి సైదులు మాట్లాడుతూ...బహుజనుల రాజ్యాధికారమే లక్ష్యంగా జీవితాంతం శ్రమించిన మహనీయుడు కాన్షీరాం సాహెబ్ అని కొనియాడారు. ఆయన ఆశయ సాధన...